దేశవ్యాప్తంగా వేగంగా వాక్సీనేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వైద్యసిబ్బందికి పనిబారం అధికమైందన్న విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది విదుల నిర్వహణ వల్ల యావత్ దేశప్రజలు కరోనా తట్టుకోగలిగే యాంటీబాడీస్ ను కలిగివుంటున్నారు. కానీ ఇందులో కొందరు వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవైద్య సిబ్బంది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. బీహార్ లోని ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వాక్సీన్ డోసులు ఇవ్వడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో నిరక్షరాస్యుల సంఖ్య అధికంగా వున్న నేపథ్యంలో వైద్యాధికారులు తగు చర్యలు తీసుకుని వాక్సీన్ ప్రక్రియను చేపడుతున్నా అక్కడక్కడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా నల్గొండ జిల్లాలో కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు స్థానిక వైద్య సిబ్బంది ర్యాబిస్ వాక్సీన్ ఇవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కరోనా టీకా వేయించుకునేందుకు కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల వెళ్లింది. అయితే తనకు చదువు రాకపోవడంతో.. ఏ వాక్సీన్ తీసుకోవాలో తెలియని ఆమె తాను పనిచేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. ఇక్కడి పీహెచ్సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు.
విషయం తెలియని ప్రమీల పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ఉన్న నర్సు అప్పటికే ఓ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగా, అదే సమయంలో వెళ్లిన ప్రమీలకు కూడా అదే సిరంజితో రేబిస్ టీకా ఇచ్చింది. కొవిడ్ టీకా ఇవ్వాలంటూ టీచర్ ఇచ్చిన లేఖ చూడకుండా తనకు అంతకుముందు ఉపయోగించిన సిరంజితోనే టీకా వేసిందని ప్రమీల ఆరోపించింది. ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా వేస్తారని ప్రశ్నిస్తే నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొంది. బాధితురాలు కొవిడ్ టీకా బ్లాక్‌లోకి వెళ్లకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లడం వల్లే ఈ పొరపాటు జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. నిజానికి ఆమెకు వేసింది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కాదని, టీటీ ఇంజక్షన్ మాత్రమేనని, దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని అంటున్న అధికారులు అదే సిరంజీతో ఎలా ఇంజక్షన్ ఇస్తారన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వకుండా జారుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more