నాలుగేళ్ల పాపకు నిప్పు గురించి ఏం తెలుసు.? అది సృష్టించే బీభత్సం గురించి మాత్రం ఏం తెలుసు.? తన ఇంట్లో టీవీలో వస్తున్న ఓ పాటకు డాన్స్ చేస్తున్న చిన్నారి.. తన దృష్టిని పాటపై నుంచి మరల్చి.. ప్రమాదాన్ని పసిగట్టగలదా.? కానీ ఈ చిన్నారికి మాత్రం తమ ఇంట్లో ఏదో జరగకూడదని జరుగుతుందని తెలిసింది. ప్రమాదం ఎంత భయానకంగా ఉంటుందో పసిగట్టేంత ముందుచూపు లేకున్నా.. తన ఇంట్లోని వంటగదిలో ఎప్పుడూ కనిపించని నిప్పు బయటకు రావడంతో ఇది ప్రమాదానికి దారి తీస్తుందని మాత్రం గ్రహించిన చిన్నారి.. తన ఇంటిని కాపాడుకునేందుకు ఏం చేసిందో తెలుసా.?
ఇంట్లోని నాలుగేళ్ల చిన్నారి టీవీలో డస్నీ ఫిల్మ్ లో ఫ్రోజెన్ చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేస్తూ ఆడుకుంటోంది. తన వెంట తమ ఇంటి పెంపుడు శునకం కూడా తిరుగుతోంది. కానీ ఆ చిన్నారి దృష్టి ఏదో కాలుతున్న వాసనపై పడింది. వెంటనే వచ్చి చూడగా, తమ వంటగదిలో ఎయిర్ ప్రైయర్ నుంచి మంటలు వ్యాపించడం చూసింది. అమ్మో మంటలు.. వీటిని చూస్తే తన తండ్రి తనను చంపేస్తాడని భయపడింది. కానీ వెంటనే తన నాన్న కోసం వెళ్లింది. ఆయన అప్పుడే వాష్ రూంకి వెళ్లాడు. దీంతో కిచన్ లో మంటలు వ్యాపిస్తున్నాయి అంటూ తండ్రికి వినబడేలా బిగ్గరగా అరిచింది.
అంతే ఒక్క ఉదుటున వచ్చిన చిన్నారి తండ్రి కిచెన్ లోకి పరుగులు తీసి.. చుట్టూ చూశాడు. ఎక్కడా తనకు ఫైర్ ఎస్టింగ్విషర్ కనిపించలేదు. దీంతో తన చేతులతో ఎయిర్ ఫ్రైయర్ లాగి పరుగు పరుగున వెళ్లి తన ఇంటి పూల్ లో పడేసాడు. ఆ వెంటనే కిచన్ లోకి వచ్చి అక్కడ చెలరేగుతున్న మంటలను పూర్తిగా ఆర్పివేశాడు. కాగా తన చిన్నారి చిట్టితల్లి అమెలియా జర్మెన్ కారణంగానే తన ఇళ్లు దగ్దం కాకుండా రక్షించిందని చిన్నారి తండ్రి డానియల్ పాట్రిక్ జెర్మెన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు.
ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగ్గా అందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ అదృష్టవశాత్తు తన చిన్నారి మంటలను చూసి అప్రమత్తమై తనను పిలిచిందని, అమె అరిచిన అరుపులను తాను రెండు మూడు నిమిషాలు తేలిగ్గా తీసుకుని వున్నా తమ ఇళ్లు దగ్ధమయ్యేదని అన్నారు. తన కూతురే ఇంటిని, తమను కాపాడిందని చెప్పాడు. ఎయిర్ ఫ్రయిర్ షాట్ లో సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలిపాడు. వెనుకవైపు పాట పెద్దగా వస్తున్నప్పటికీ కిచెన్ లో మంటలను గమనించిందని, నిజంగా తన పాప రియల్ హీరో అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మంటలను ఆర్పే ప్రయత్నంలో డానియల్ కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇంట్లోని పెంపుడు కుక్కలతో పాటు కుటుంబమంతా సురక్షితంగా ఉన్నట్టు తెలిపాడు. గారాల పట్టి అమెలియాకు ధన్యవాదాలు తెలిపాడు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more