దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్రమంగా కొత్త కేసులు తగ్గుతున్నాయి. దాదాపుగా నాలుగు నెలల తరువాత నలభై వేలకు దిగువన దేశంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని ఎస్బీఐ తాజా సర్వే చెబుతోంది. వచ్చే నెల అంటే ఆగస్టులోనే ఈ మూడో వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తన తాజా నివేదికలో హెచ్చరించింది.
కొవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్బీఐ తన పరిశోధన నివేదికను రూపొందించింది. కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ సెప్టెంబర్లో ఉంటుందనీ ఈ అధ్యయనం అంచనా వేసింది. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చు. అయితే ఆగస్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్బీఐ రిపోర్ట్ అంచనా వేసింది.
కరోనా థర్డ్ వేవ్ సగటు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో నమోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువగా ఉండనున్నట్లు గ్లోబల్ డేటా చెబుతోంది. ఆగస్టు రెండో వారంలో కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమై.. నెలలోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది. ఇక వ్యాక్సినేషన్ల విషయానికి వస్తే.. దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తున్నారు. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు. వచ్చే నెలలోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని, సెప్టెంబర్ లో పీక్ కి వెళ్లనుందన్న ఎస్బీఐ నివేదిక అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more