ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వశాఖ త్వరలోనే శుభవార్తను అందించనుంది. అయితే ఇది కేవలం రెగ్యూలర్ రైలు ప్రయాణికులకు మాత్రమే. ఔనండీ కరోనా మహమ్మారికి ముందుకు సుదూర ప్రాంతాలకు విద్య, ఉద్యోగం, వ్యవహారాలు, వ్యాపారాల నిమిత్తమై ప్రతి రోజు రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే పాస్ తీసుకునేవారు. ప్రతీ నెల వీటిని రినీవాల్ కూడా చేయించుకునేవారు. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు రైళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో.. దాంతోనే ఈ నెలవారీ పాసులు కూడా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో అన్ని వ్యవహారాలు యధావిధిగా నడుస్తున్నాయి.
ఈ క్రమంలో రైల్వే కూడా త్వరలో నెలవారీ పాసులు జారీ చేయనుంది రైల్వే వర్గాల సమాచారం. రైల్వే ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నెలవారీ పాసులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. నెలవారి పాసులు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికప్పుడు టిక్కెట్ తీసుకునే రైలులో ప్రయాణించే అవకాశం లేకపోవడం.. ముందస్తు రిజర్వేషన్ తో మాత్రమే ప్రయాణించే వెసలుబాటు వుండటంతో రెగ్యూలర్ గా రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల భోపాల్ రైల్వే డివిజన్ నెలవారీ పాస్ లను తిరిగి పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదన పంపింది. అయితే దీనిపై కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులందరికి వర్తించేలా ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. నెలవారీ పాస్ ల జారీ ద్వారా రైల్వేకు నికర అదాయం లభిస్తుంది. గత ఏడాదిగా సీజనల్ పాస్ ల జారీ నిలిచిపోవటంతో వచ్చే ఆదాయానికి గండిపడింది. త్వరలో తీసుకోబోయే రైల్వే శాఖ నిర్ణయం కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more