కలియుగ వైకుంఠధామంగా భక్తుల కోంగుబంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. తిరుమల సప్తగిరులను కొందరు భక్తులు మొకాళ్లతో కూడా ఎక్కుతుంటారు. ఇక మరికోందరు భక్తులు ప్రతీ మెట్టుకు బొట్టు పెడుతూ అన్ని మెట్లపై శ్రీవెంకటేశ్వరుడే వున్నాడని భావిస్తుంటారు. అంతటి పవిత్రతతో కూడిన కొండలపై కొందరు భక్తులు మద్యం సేవిస్తూ కనిపిస్తే.. అదే దారిలో వెళ్లిన కొందరు శ్రీవారి భక్తులు రగిలిపోయారు. పవిత్రమై తిరుమల కోండలపై మహాపచారం చేస్తున్నారని వారు తిరుమల విజిలెన్స్ అధికారులకు పిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి మద్యం సేవిస్తున్న భక్తులను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారుల భద్రతా డొల్లతనం మరోమారు బట్టబయలైంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేసిన తరువాత కానీ లోనికి అనుమతించరు. అలాంటిది వారి తనిఖీలను పూర్తి చేసుకున్న తరువాత వాహనానికి అనుమతి ఎలా లభించిందని.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్ నుంచి బ్రీఫ్ కేస్ వరకు ప్రతి ఒక్కటీ తనిఖీ చేసే సిబ్బంది కారులోని మద్యం బాటిళ్లను ఎలా తనిఖీ చేయడం మర్చిపోయారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వాహనాల తనిఖీ కోసం పెద్ద సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, కాంట్రాక్టు సిబ్బంది విధి నిర్వహిస్తున్నా. వారిని దాటుకుని మద్యం బాటిల్ ఎలా వెళ్లగలిగిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
దీంతో అలిపిరి వద్ద నిఘా వైఫల్యం, భద్రతా డోల్లతనం మరోమారు బట్టబయలైంది. నాగాలాండ్ కు చెందిన భక్తులు తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మద్యం సేవిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. మద్యం బాటిళ్లతో వారి కారు కొండపైకి ఎలా వచ్చిందనేది ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలిపిరి వద్ద తూతూమంత్రంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. తిరుమల కోండపై అనేక నిబంధనలు వున్నా.. వాటికన్నా అధికంగా భక్తుల నమ్మకాలతో ముడిపడిన అంశాన్ని నాగాలాండ్ భక్తులు ఎలా అతిక్రమించారన్నది మరో ప్రశ్న. మద్యం బాటిల్ తో పాటు వీరు కొండపైకి వెళ్లిన వ్యవహారం స్పెషల్ కేస్ గా మారింది. దీంతో ఇక్కడ విజిలెన్స్ అధికారుల వైఫల్యం కొట్టోచ్చినట్టు కనబడుతోందని భక్తులు మండిపడుతున్నారు.
అయితే మద్యం తాగుతూ పట్టుబడ్డ నాగాలాండ్ భక్తులు మాత్రం తాము తొలిసారిగా తిరుమత తిరుపతి దేవస్థానానికి విచ్చేసామని.. ఇక్కడి ఆచార వ్యవహారాలు తమకు తెలియదని చెప్పారు. దీంతోనే తాము కారులో మద్యం సేవించామని అన్నారు. ఇక విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న తరువాత వారు చెప్పిన సమాధానం విని అధికారులే అవాక్కవుతున్నారు. అలిపిరి వద్ద తమను సరిగ్గా తనిఖీ చేసి, మద్యం బాటిల్ సీజ్ చేసి ఉంటే తాము ఈ పని చేసి ఉండేవారం కాదు కదా అంటూ సమర్ధించుకున్నారు. తమకు తిరుమల నిబంధనలు తెలియవని, పొరపాటు చేశామన్నారు. అలిపిరి వద్ద తనిఖీలు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ వ్యవహారాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more