రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రైలు ఏ సమయానికి వస్తుందో.. టికెట్లు ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి సామాన్య ప్రయాణికులు జారుకున్నారు. ఏ రైలును ఎప్పుడు ప్రవేశ పెడుతున్నారో.. ఎప్పుడు రద్దు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొనింది. ఇక అంతర్జాలమే తెలియని వాళ్లు రైలు ప్రయాణాలకు కూడా దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి సాధారణ రైళ్లన్నీ పట్టాలెక్కనున్నాయని ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. అంతేకాదు.. ప్యాసింజర్ రైలులో ప్రయాణం కోసం ఇక నుంచి స్టేషన్లోనే టికెట్లు ఇవ్వనున్నారు రైల్వే అధికారులు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాయచూరు వరకు రైళ్లు నడపున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణికులందరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని పేర్కొంది. స్టేషన్లు, రైళ్లలో కొవిడ్ ప్రొటోకాల్ కఠినంగా అమలు చేయనున్నారు. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more