కళ్ల ముందు చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. ఇంట్లోకి చొరబడి బలవంతంగా ఓ నటుడిని తీసుకెళ్లి.. అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేసిన ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది. తాలిబన్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అఫ్ఘనిస్తాన్‌లో ప్రధాన భూభాగాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అక్కడి ప్రజలను అతి క్రూరంగా హింసిస్తున్నారు. కొన్ని రోజులుగా ఇదే అక్కడ హాట్ న్యూస్ కూడా. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి ప్రముఖ హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ అకా ఖాసా జవాన్‌ను కూడా కిడ్నాప్ చేసి చంపేశారు. కందహార్ ప్రావిన్స్‌లో ఈయన్ని హతమార్చారు. అయితే హత్యకు ముందు జరిగిన సంఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు విడుదలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో హాస్యనటుడిని చెంపదెబ్బ కొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చుట్టూ గన్స్‌తో కూర్చున్న వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. అత్యంత దారుణంగా హింసించి నాజర్‌ను చంపేసినట్లు తెలుస్తోంది. అక్కడ యుద్ధంతో దెబ్బతిన్న దేశ ప్రజలను తన హాస్యంతో నవ్వించిన పాపానికి ఈయన్ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. కందహార్ ప్రావిన్స్‌లో ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసే వ్యక్తులను గుర్తించి చంపడానికి తాలిబాన్లు ఇంటింటినీ వెతుకుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొందర్ని అత్యంత క్రూరంగా చంపేస్తున్నారు. ఈ క్రమంలోనే నాజర్ మొహమ్మద్ కిడ్నాప్ చేసి జూలై 23న హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆప్ఘన్ మీడియా కథనాల ప్రకారం నాజర్ మొహమ్మద్ ఇంతకు ముందు కందహార్ పోలీసు విభాగంలో పనిచేశాడని తెలుస్తోంది. పోలీసు ఉద్యోగం వదిలేసిన తర్వాత కమెడియన్‌గా మారి ఆయన అందర్నీ నవ్విస్తూ బాధలు మరిచిపోయేలా చేస్తున్నాడని తాలిబాన్లు అతడిపై కసి పెంచుకున్నారని అక్కడి మీడియా చెబుతోంది. అందుకే కార్లో ఎక్కించుకున్న దగ్గర నుంచి కూడా ఆయన్ను హింసిస్తూనే ఉన్నారు. ఇవే కాకుండా అతడిని స్థానిక భాషలో తిడుతూ ఉన్నారు. ఏదేమైనా నాజర్ మహ్మద్ హత్య ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.
An Afghan comedian from Kandahar, who made people laugh, who speaks joy and happiness and who was harmless, was killed brutally by Taliban terrorists. He was taken from his home. pic.twitter.com/SHSeY3t9DK
— Ihtesham Afghan (@IhteshamAfghan) July 27, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more