దేశంలో ఉగ్రదాడులకు ముష్కరమూకలు కొత్తరకం పంథాను ఎంచుకున్నాయి. డ్రోన్ల ద్వారా భారత స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి తర్వాత.. తరుచూ అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్రోన్లు సంచరించడం కలవరానికి గురిచేస్తోంది. జమ్మూకశ్మీర్ లో నెలరోజుల వ్యవధిలో ఏకంగా పదకొండు డ్రోన్లు సంచరించాయని అంటే వారి పంథను అర్థం చేసుకోవచ్చు. డ్రోన్లపై కాల్పులు జరుపుతున్న భారత భద్రతా బలగాలు ఇటీవల ఐదు కిలోల ఐఈఢీ కలిగిన డ్రోన్ ను నేలకూల్చారు. ఆ తరువాత నుంచి వారం రోజుల వరకు మిన్నకుండిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. రెండు రోజల క్రితం ఏకంగా మూడు డ్రోన్లతో భారత స్థావరాలపై నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధించిన ఆ తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ లష్కరే ముస్తాఫాకు చెందిన మరో కేసులోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నది. సోఫియాన్, అనంతనాగ్, బనిహల్‌తో పాటు సుంజవాన్ లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెయిడ్స్ చేస్తోంది. జూన్ 27వ తేదీన జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు ఐఏఎఫ్ దళ సిబ్బంది గాయపడ్డ విషయం తెలిసిందే.
అదే సమయంలో అటు పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దర్ని భారత సైన్యం కాల్చిచంపింది. తర్న్ తరాన్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు శుక్రవారం రాత్రి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. బీఎస్ఎఫ్ బలగాలు కాల్చిచంపాయని ఓ అధికారి తెలిపారు. సరిహద్దు వద్ద రాత్రి 8.48 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయని ఆయన పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారులను అడ్డుకుని పదేపదే హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు.
దీంతో ముప్పును పసిగట్టిన బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమై.. కాల్పులు జరిపాయని అధికారి తెలిపారు. భిఖివింద్ సబ్ డివిజన్ ఖల్రా గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ 103 బెటాలియన్‌కు చెందిన సిబ్బంది థె కలాన్ బోర్డర్ అవుట్ పోస్ట్ (బీఓపీ) సమీపంలో భారత వైపు ముళ్ల కంచె, జీరో లైన్ మధ్య అనుమానాస్పదంగా కదలికను గమనించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
బీఎస్ఎఫ్ దళం హెచ్చరిస్తున్నా చొరబాటుదారులు లొంగిపోకుండా తిరిగి పాకిస్థాన్‌వైపు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో బిఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు అక్కడికక్కడే మరణించారు. వారి వద్ద నుంచి రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వారు ఎవరు అన్నదానిపై భద్రతా దళాలు విచారణ జరుపుతున్నాయి. ఇంకా వీరితో పాటు ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more