Bars, Wine Shops Closed Two Days For Bonalu మద్యం ప్రియులకు చేధువార్త.. దుకాణాల బంద్

Hyderabad bars wine shops closed two days for bonalu

Hyderabad bonalu, Bonalu festival, Bonalu fest, Bonalu celebrations, Old city Bonalu fest, Bonalu, Old city Bonalu, Grama Devatalu, Excise officials, liqour stores, bars, restarants, wine shops, Hyderabad Wine stores closed, Hyderabad bars closed, Bonalu celebrations, Bonalu 2021, wine shops closed for bonalu, liquor sales banned during bonalu, Hyderabad liquor shops, Bonalu in Telangana, Hyderabad, Telangana, Politics

The Telangana government has also made several arrangements for the Bonalu fest in Hyderabad. In this regard liquor stores, bars and restaurants will be closed on Sunday and Monday like every year. As part of maintaining law and order, the government has ordered that all the liquor and wine stores be closed for bonalu.

మద్యం ప్రియులకు చేధువార్త.. హైదారబాదులో దుకాణాల బంద్

Posted: 07/31/2021 01:24 PM IST
Hyderabad bars wine shops closed two days for bonalu

తెలంగాణలో ఆషాడ మాసం వచ్చిందంటే చాటు బోనాల పండగ ప్రారంభమవుతుంది. ఆషాడం మొదలుకుని శ్రావణ మాసం వరకు తెలంగాణలోని గ్రామ దేవతలకు బోనాలు చేయడం అనవాయితి. ఈ బోనాలలో ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి పెరుగు అన్నం, బెల్లం, ఆకు కూర ఇత్యాదులను సమర్పించడం తెలంగాణ మహిళలకు ఆనవాయితి. సికింద్రాబాదులోని లష్కర్ బోనాలు పూర్తైన తరువాతి వారం దాదాపుగా హైదరాబాద్ నగరంలోని అనేక ఆలయాల్లో ఈ బోనాల పండగ ఉత్సవాలు జరుగుతాయి.

ఈ క్రమంలోనే పాతబస్తీలోనూ బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. రేపట్నించి రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో బొనాల ఉత్సవాలకు ప్రభుత్వం కూడా పలు ఏర్పాట్లు చేసింది. బోనాలు ఉత్సవాల నేపథ్యంలో మధ్యహ్నం నుంచి మందు, విందు కార్యక్రమాలు నగరవ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. ఫుల్ ఎంజాయ్ మెంట్ గ్యారంటీ అనుకునేవాళ్లకు ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా మందుబాబులకు రాష్ట్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆది, సోమవారాల్లో మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది.

మందుబాబులకు ఏ మాత్రం రుచించని ఈ చేధువార్తను అందించింది. దీంతో ఆది, సోమవారాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణాలను బంద్ చేయాలని అదేశించింది. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, నీరా కేంద్రాలను కూడా మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు. నిబంధనలు ధిక్కరించి మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles