watch why arrest lucknow girl is trending.? నెట్టింట్లో వైరల్ గా అరెస్ట్ లక్నో గర్ల్ హ్యాష్ ట్యాగ్.. వీడియో వైరల్

Video of woman hitting cab driver goes viral twitterati demand arrestlucknowgirl

gril assaults cab driver, girl assaults mediator, girl assaults cab driver on road, uttar pradesh girl assaults cab driver, cab driver assaulted awadh cross road, lucknow, Awadh crossroads, #ArrestLucknowGirl, lucknowgirl, viral, social media, twitter, Uttar Pradesh news, viral video

In a shocking video that is going viral on Twitter, a woman can be seen slapping a cab driver in the middle of a road at Awadh crossing in Lucknow, Uttar Pradesh. The video has caused a lot of uproar on Twitter with people asking for justice for the cab driver.

నెట్టింట్లో వైరల్ గా అరెస్ట్ లక్నో గర్ల్ హ్యాష్ ట్యాగ్.. వీడియో వైరల్

Posted: 08/02/2021 01:33 PM IST
Video of woman hitting cab driver goes viral twitterati demand arrestlucknowgirl

సాధారణంగా మహిళలకు ఏదేని చిన్న కష్టం.. అందులోనూ యువతులకు ఏదేని కష్టం వచ్చినా ముందేండే మగవాడు.. ఆ కష్టం తీర్చడానికి.. జరిగిన విషయాన్ని మీడియాతో పాటు పోలీసులకు కూడా పిర్యాదు చేయడానికి వెనక్కు జరగడు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా జరిగిందో ఘటన. దేశంలోనే అత్యంత పెద్దదైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని లక్నో నగరంలో జరిగిందీ ఘటన. కానీ, ఓ యువతి ట్రాఫిక్ పోలీసును కూడా పట్టించుకోకుండా ఓ క్యాబ్ డ్రైవర్ ను ఎగిరెగిరి కొట్టింది. అంతేకాదు అసలు విషయం ఏమిటో కనుకుందామని వెళ్లిన మధ్యలోకి వెళ్లిన వ్యక్తితోనూ దూకుడుగా వ్యవహరించింది.

దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోకు చెందిన యువత.. యువతిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ యువతిని కూడా నలుగురిలో, నడిబజారులో అందరూ చూస్తుండగా, ఆ యువతి ఎలా అయితే టాక్సీ డ్రైవర్ ను కోట్టిందో.. అలానే.. అమెను కూడా చాచిపెట్టి రెండు చెంపలు వాయించాలని, అమె ఫోన్ ను కూడా నేలకేసి విసిరకోట్టి పదాహారు ముక్కలయ్యేలా చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అసలెందుకు ఇలాంటి డిమాండ్ చేస్తున్నారు లక్నోలోని యువత అంటే ఈ వీడియోను మీరు చూడాల్సిందే..


ఓర్నీ ఈ యువతికేం కష్టం వచ్చిందో.. టాక్సీ డ్రైవర్ అమెను ఏమైనా అసభ్యపదజాలంతో కామెంట్ చేశాడా.? లేక మరేవిధంగానైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా.? మరెందుకు యువతి అతడ్ని అలా చాచిపెట్టి ఎడాపెడా వాయించేస్తోందని అంటే.. లక్నోలోని అవాధ్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. టాక్సీ డ్రైవర్ రెండు చెంపలు అందకపోయినా సరే ఎగిరెగిరి మరీ వాయించేస్తోంది. టాక్సీ డ్రైవరు మాత్రం ఏమనకుండా మిన్నకుండాపోయాడు. అయితే ఏదో జరిగేవుంటుంది.? మరి ఆ జరిగిన విషయం ఏమిటీ.? ఎందుకుని ఆ యువతి టాక్సీ డ్రైవరును వాయిస్తోంది.?

ఈ విషయం తెలుసుకుందామని మధ్యలోకి వెళ్లిన ఓ యువకుడు టాక్సీ డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు. ఆ తరువాత యువతితో మాట్లాడాడు. ఏం జరిగిందీ. ఎందుకని కొడుతున్నారని అడిగాడు. అతడి ప్రశ్నలు ఏ మాత్రం బదులు చెప్పని యువతి.. టాక్సీ డ్రైవర్ ను మాత్రం ఎగిరెగిరి కొట్టడం ఆపడం లేదు. మధ్యలో జోక్యం చేసుకున్న వ్యక్తి ఎందుకలా కోడుతున్నావ్.? అడుగుతున్నా కదా.? విషయం చెప్పకుండా విక్షణా రహితంగా కోడతారేంటి అని అడిగాడు. అంతే టాక్సీ డ్రైవర్ నుంచి గాలి మళ్లిన యువతి వెంటనే మధ్యవర్తితో వాదనకు దిగింది. అతని కాలర్ పట్టుకుంది. అతనితో వాదించి.. వాదించి చేయి కూడా చేసుకోబోయింది.


అసలు యువతి వీరిపై ఇలా తిరగబడటానికి కారణం ఏంటీ అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ట్రాపిక్ సిగ్నల్ వద్ద ఇంకా రెడ్ లైట్ పడలేదని వాహనాలు రువ్వమంటూ పోతున్నాయి. పాదచారులు వెళ్లేందుకు గ్రీన్ లైట్ కూడా పడలేదు. అయినా అప్పటికే ఓ యువతి రోడ్డుపై నున్న వాహనాలను దాటుకుంటూ అవతలి నుంచి ఇవతలి వైపుకు వచ్చేసింది. ఈ క్రమంలో అమె అకస్మాత్తుగా రోడ్డు దాటుతుండటం.. అప్పుడే సిగ్నల్ పడటంతో టాక్సీ డ్రైవర్ అమెను చూసి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అంతకు కొన్న క్షణాల ముందుకు వరకు స్పీడుగా వస్తున్న వాహనం తనవద్దకు చేరుకునే సరికి బ్రేక్ పడింది. కానీ యువతి మాత్రం తనను వాహనం గుద్దినంత పని చేసిందని, పైప్రాణాలు పైనే పోయాయని టాక్సీ డ్రైవర్ పై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను కూడా వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles