ఉత్తర్ ప్రదేశ్ లోని ఫరీధాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా తన చైన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న కళ్లజోడు బ్రాండ్ సంస్థ లెన్స్ కార్ట్.. నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా 2000 మంది ఉద్యోగులను తీసుకుని తమ ఉద్యోగుల సంఖ్యలో మరింత పెంచుకుంటామని అంటోంది. లెన్స్‌కార్ట్ 300 మంది ఉద్యోగులను సింగపూర్, మిడిల్ ఈస్ట్ సహా అమెరికాలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది. దీంతో లెన్స్ కార్ట్ తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగానూ విస్తరించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు లెన్స్ కార్ట్ ఒక ప్రకటనలో పేర్కోంది.
డేటా సైంటిస్టులు, బిజినెస్ ఎనలిస్టులు, డేటా ఇంజినీర్లు మరియు నిపుణులతో పాటు తమ వాపార దుకాణాల్లో పనిచేసే సాధారణ ఉద్యోగులను కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఓ వైపు తమ కంపెనీ టెక్నాలజీ సహాడేటా సైన్స్ టీమ్‌ను బలపేతం చేసుకుంటూనే మరోవైపు లెన్స్ కార్ట్ స్టోర్ల నిర్వహణకు 1,500 మంది రిటైల్ ఉద్యోగులను నియమించుకోనుంది. బెంగుళూరు, ఎన్‌సిఆర్ హైదరాబాద్ అంతటా 100 మంది ఇంజనీర్లను సాంకేతిక బృందానికి చేర్చాలని చూస్తోంది. ఇక వీరితో పాటు మరో 300 మంది కళ్లజోళ్లు తయారీ కార్యకలాపాలలో నియమాకం అవుతారని చెప్పంది.
దీంతో పాటు కొందరికి ఫైనాన్స్, వినియోగదారు అంతర్దృష్టులు, మానవ వనరులు, మర్చండైజింగ్ అంతటా కార్పొరేట్ ఫంక్షన్ల కోసం 100 మందిని నియమించుకుంటామని ప్రకటనలో పేర్కోంది. 2010 లో బన్సాల్, అమిత్ చౌదరి మరియు సుమీత్ కపాహి స్థాపించిన లెన్స్ కార్ట్ దేశంలోని ప్రధాననగరాల్లో 750 పైగా తమ ఓమ్ని చానెల్ స్టోర్స్ కలిగి ఉంది. భారతదేశం, సింగపూర్, మధ్యప్రాచ్య దేశాలలో ప్రతి సంవత్సరం 70 లక్షల మందికిపైగా కస్టమర్లకు తమ చైన్ షాపింగ్ ద్వారా సేవలను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more