దొంగ-దొంగది చిత్రంలో హీరో మంచు మనోజ్ కోసం బజార్లో తగువుపడ్డ యువతులను చూశాం.. ఇలాంటి సన్నివేశాలు ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లోనే వచ్చాయి. అయితే సినిమాల్లో రెండున్నర గంటల ఆటను రక్తికట్టించడానికి ఇలాంటి ఘటనలు బాగుంటాయ్ కానీ.. అదే నిజజీవితంలో ఇలాంటి ఘటనలు ఎదురయితే.. చాలా కష్టం. ఎందుకంటే జీవితం అన్నది నూరేళ్ల ఆట. కోపంలో తీసుకున్న నిర్ణయానికి మనం అనునిత్యం అనుభవించాల్సి వుంటుంది. అయితే ఇలాంటి ఘటనలతో జీవితంలో సంతోషాన్ని కూడా దూరం చేసుకున్నవాళ్లం అవుతామని గ్రహించాలి.
అది తెలియక.. జీవితాన్ని కూడా సినిమాలా భావించిన ఇద్దరు యువతులు బాయ్ ఫ్రెండ్ కోసం నడిజబారులో సిగపట్లకు దిగారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కిందపడి బాహాబాహీకి దిగారు. తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో తిరుగుతుండడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మరో యువతి తట్టుకోలేకపోయింది. ఆమె జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది. ఆమె కూడా ఎదురుతిరిగింది. దీంతో సీన్ రసవత్తరంగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు కిందపడి మరీకొట్టుకున్నారు. తామేం చేస్తున్నామో అన్న విషయం కూడా మర్చిపోయారు. అయితే వీరిని విడిపించేందుకు ఓ యువతితో సహా అక్కడే వున్న బాయ్ ఫ్రెండ్ ప్రయత్నించారు.
వారి ప్రయత్నాలను తోసిరాజుతూ కిందపడిన యువతులు మరింతగా రెచ్చిపోయారు. వీరు విడదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. వారు ఆగలేదు సరికదా, మరింతగా చెలరేగిపోయారు. ఈ క్రమంలో తన స్నేహితురాలిని కొడుతున్న యువతి చేయిపట్టుకుని లాగడంతో బాయ్ ఫ్రెండ్ కు కోసం వచ్చింది. అంతే అతను విడదీస్తున్న యువతిపై మండిపడ్డటంతో పాటు చేయికూడా చేసుకున్నాడు. దీంతో కిందపడి కొట్టుకున్న యువతులు విడిపోయారు. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునేలోపే యువతులిద్దరూ పరారయ్యారు. ఝార్ఖండ్ లోని జరాయ్ కేలాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఒక లుక్కేయండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more