తాలిబన్లపై కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నంత మాత్రన వారు పరిపాలకు కాలేరని, వారిని ఇన్నాళ్లు ఉగ్రవాదులుగానే పరిగణించాం.. ఇకపై కూడా ఉగ్రవాదులుగానే గుర్తించాల్సిన అవశ్యకత వుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ను చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. చైనా, పాకిస్థాన్ లు ఇప్పటికే తాలిబన్లకు మద్దతుగా స్పందించాయి. ఈ అంశంపై భారత్ ఇంకా స్పందించలేదు.
మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా... వారిని ఉగ్రవాదులుగానే గుర్తించాలని ఆయన చెప్పారు. తొలి నుంచి తాలిబన్లను కెనడా టెర్రరిస్టులుగానే చూస్తోందని అన్నారు. టెర్రరిస్టుల జాబితాలో తాలిబన్లు ఉన్నారని చెప్పారు. తాలిబన్ల పాలనపై ఆంక్షల విధింపుపై తాము చర్చిస్తామని తెలిపారు.
ఈరోజు జీ7 దేశాధినేతలు వర్చువల్ గా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో వీరు ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న పరిణామాలపై చర్చించనున్నారు. జీ7 గ్రూపులో కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు ఉన్నాయి. ఈ సమావేశంలో తాలిబన్లపై ఆంక్షలు విధించే అంశంపై తాము చర్చిస్తామని చెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి బ్రిటన్ అధ్యక్షత వహిస్తోంది. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ తాలిబన్ల వ్యవహారశైలిని బట్టి ఆంక్షలను విధించడంపై ఆలోచిస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more