పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పట్లు, తాళాల, తళంబ్రాలు మూడే ముళ్లు, ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అంటూ ఒక ఫేమస్ పాట ఉంది గుర్తుందా? అది అప్పటి పాటే కాదు.. పెళ్లితో ఏకమవుతున్న జంట మనస్సులోత్తులో కదిలాడే భావం.. బంధం.. కూడా. ఆ రోజుల్లో పెళ్లి మండపంలోకి వధువు రావాలంటే.. తన సోదరులో లేక మేనమామలో గంపలో కూర్చోబెట్టుకుని ఎత్తుకుని తీసుకువచ్చేవారు. అదీ కాకపోతే పెళ్లి కూతురు తన స్నేహితులతో కలసి పెళ్లిమండపానికి వస్తుంది. కానీ మారుతున్న కాలంతో పాటు అన్ని మారుతున్నాయి. ఇప్పుటి తరం వధూవరులకు పెళ్లంటే సంగీత్.. తరువాత పెళ్లి మండపంలోకి ఎంట్రీ సాంగ్.. ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు.
ఇక పెళ్లికూతురు ఏదైనా విషయంలో అలిగితే.. అమ్మో.. ఒకరి తరువాత ఒకరు వచ్చి అలకకు కారణాలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి హుటాహుటిన కదులుతారు. ఇక వదువుగా వున్నవాళ్లు చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతుంటారు. బాధపడుతుంటారు. మొహం మాడ్చుకుంటారు. ఎవ్వరితో మాట్లాడరు. తమలో తామే బాధపడతారు. కొంత సేపటి తర్వాత మళ్లీ నవ్వు ముఖం పెడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పెళ్లి కూతురు కూడా అటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయే. ఎందుకంటే.. ఓవైపు తన పెళ్లి జరుగుతుంటే.. పెళ్లి కోసం అతిథులు వచ్చాక.. పెళ్లి కొడుకు.. పెళ్లిమండపం మీద తన కోసం వెయిట్ చేస్తుంటే.. నేను పెళ్లి మండపం ఎక్కను.. అంటూ మారాం చేసింది. అలిగింది. దీంతో పెళ్లికి వచ్చిన వాళ్లు షాక్ అయిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకమ్మా.. ఎందుకు పెళ్లిమండపం ఎక్కడం లేదు? ఏమైంది.. అని బంధువులు ఆరా తీయగా.. పెళ్లి కూతురుగా నేను ఎంట్రీ ఇస్తున్నప్పుడు.. నేను చెప్పిన పాటను ప్లే చేయలేదు ఎందుకు? అంటూ ఈవెంట్ ఆర్గనైజర్స్తో గొడవేసుకుంది పెళ్లి కూతురు. నేను ముందే చెప్పాను కదా.. ఆ పాట ప్లే చేయమని. నేను పెళ్లి చేసుకోనుపో. నేను అసలు పెళ్లిమండపమే ఎక్కను.. అంటూ అందరినీ ఇబ్బంది పెట్టింది ఆ పెళ్లికూతురు. చివరకు తన కుటుంబ సభ్యులు.. తనను ఓదార్చడంతో ఒక చిరునవ్వు నవ్వి.. పెళ్లి పీటలు మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది వెడ్డింగ్ బ్రిగేడ్ (The Wedding Brigade) అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లు అయితే.. ఆ వీడియోను చూసి నవ్వలేక చచ్చిపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more