how sacked U.P IPS officer was arrested సీఎం యోగీపై పోటీచేస్తానన్న ఐపీఎస్ అరెస్టు..

Senior ips officer shouts screams as police push him into jeep

Yogi adityanath, amitabh thakur, arrest, gorakpur, ex-ips arrest, raja bhaiya, rape victim, suicide case, self-immolate, supreme court, Crime

A former IPS officer Amitabh Thakur was arrested in a dramatic fashion in Lucknow by the UP Police. Video of Thakur’s arrest has now gone viral on social media. In the video, he can be seen resisting his arrest as the cops shove him into a police vehicle.

ITEMVIDEOS: అత్యాచార బాధితురాలి ఆత్మహత్య కేసు: మాజీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

Posted: 08/28/2021 03:33 PM IST
Senior ips officer shouts screams as police push him into jeep

తనపై అత్యాచారం చేసిన బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్‌పై కేసు పెట్టినందుకు పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఇటీవల దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పది రోజుల క్రితం యూపీకి చెందిన యువతీ.. తన సోదరుడితో పాటు సుప్రీంకోర్టు ప్రాంగణానికి వచ్చింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. హుటాహుటిన స్పందించిన పోలీసులు వెంటనే వచ్చి మంటలను ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స పోందుతూ సదరు బాధితురాలు మృతిచెందింది. కాగా, అంతకుముందు బాధితురాలు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు. ఈ వీడియోలో 24 ఏళ్ల బాధిత యువతి మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలినైన తనను యూపీ పోలీసులు క్యారెక్టర్ లేని మహిళగా, చరిత్ర హీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కై తనను వేధిస్తున్నారని వాపోయింది. వారి వేధింపులు తాళలేకే  తాను ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

తనపై అత్యాచారం చేసిన. నేరచరిత కలిగిన ఎంపీని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని అమె పేర్కొంది. ఎస్పీ, పోలీసులు, రాజకీయ నేతలు, ప్రయాగ్ రాజ్ కోర్టు న్యాయమూర్తి కలిసి తనను వేధిస్తున్నారని ఆరోపించింది. గత నెల 9న తాను కోర్టుకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి అందులో పేర్కొన్న వారితో పోలీసులు కుమ్మక్కై తనపైనే తిరిగి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆరోపించింది. బాధితురాలి సెల్పీ వీడియోను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. అమె అరోపణల నేపథ్యంలో దర్యాప్తుకు అదేశించింది.

ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. బాధితురాలిపై అపవాదు మోపి, ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పడంలో అమితాబ్ ఠాకూర్ పాత్ర ఉందని తేల్చింది. సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు అమితాబ్‌ ఠాకూర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, తానో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు అమితాబ్ ఠాకూర్ నిన్న ఉదయమే ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన అమితాబ్ ఠాకూర్ తో కేంద్రం ఇటీవల నిర్బంధ పదవీ విరమణ చేయించింది. కాగా, అమితాబ్ ఠాకూర్ కు లక్నో కోర్టు వచ్చే నెల 9 వరకు జుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ సందర్భంగా ఆయన తనను కిందకు దింపాలని, అరుపుటు, పెడబొబ్బలు పెట్టిన వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles