అఫ్ఠనిస్తాన్ రాజధానిలోని కాబుల్ విమానాశ్రయం వద్ద నున్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులకు అగంతకులు పాల్పడ్డారు. ఇటీవల జరిగిన భారీ ఉగ్రదాడిని మరవక ముందే ఈ రోజు ఉదయం 6.40 గంటలకు మరోసారి రాకెట్ దాడి జరిగింది. కాగా, వాటిన అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థ నిర్వఘ్నంగా అడ్డుకోవడంలో సఫలీకృతం అయ్యింది. సోమవారం ఉదయం అమెరికా బలగాలను టార్గెట్ చేసుకుని అగంతకులు ఈ దాడులకు పాల్పడ్డారు. అగంతకులు సంధించిన రాకెట్లలో ఐదింటిని అమెరికా బలగాల యాంటి మిసైల్ వ్యవస్థతో అడ్డుకోగా, మరికోన్ని రాకెట్లు విమానా్రయం వెలుపల వున్న ప్రదేశంలో ల్యాండ్ అయ్యాయని సాక్షలు తెలిపారు.
రాకెట్ల ప్రయోగం అనంతరం సలీం కార్వాన్ పరిసర ప్రాంతాల్లో తుపాకీ పేలుళ్లు కూడా సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉగ్రవాదులు ఓ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించి దాడి చేశారని.. విమానాశ్రయంపై సంధించిన ఐదు రాకెట్లను యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకున్నామని అమెరికా అధికారి తెలిపారు. ఈ రాకెట్ దాడుల వల్ల అక్కడ పరిసరాలు పొగతో నిండిపోయాయి. కాబుల్ ఎయిర్ పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. తాలిబాన్ నియంత్రణలో ఉన్న అప్ఠనిస్తాన్ నుండి అమెరికా సైన్యం వైదొలగడానికి ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందు ఈ రాకెట్ దాడి జరగడంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు బిడెన్‌కు వివరించామని వైట్ హౌస్ జెన్ సాకి ఒక ప్రకటనలో తెలిపారు.
అయినా అమెరికా సేనలు ఆద్యక్షుడి ఆదేశాలతో తమ కార్గో విమానాల్లో దేశం వీడి వెళ్తున్న అప్ఘన్ పౌరులను తరలిపింపును రెట్టింపు వేగంతో చేపట్టాయి. ఇదిలావుండగా కాబుల్ విమానాశ్రంలోని అమెరికా సైనిక దళాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఖారోసన్ ఉగ్రవాద సంస్థ తరలిస్తున్న ఆత్మహుతి దాడుల బృందం వాహనాన్ని అమెరికా సైన్యం డ్రోన్లను ప్రయోగించి క్రితం రోజున పేల్చివేసిన విషయం తెలిసిందే. కాగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అనేక మంది అప్ఘన్ దేశ పౌరులతో పాటు పిల్లలు కూడా మరణించినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more