జాతి వైరం వున్న జీవులతో పాటు జీవనం కోసం జరిగే పోరాటంలో పలు జీవులు పోరాడుతూనే వుంటాయి. ఇలాంటి వీడీయోలనే కాదు నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనలను అనేకం మనకు తారసపడతాయి. పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి పోరాటాలు జాతివైరంతోనే. ఇలా జంతువులు పోట్లాడుకోవడమే కాదు జాతి వైరాన్ని మరచి స్నేహం చేసుకునే వీడియోలను కూడా మనం చూస్తూనే వుంటాం. అయితే జీవనం కోసం జరిగే వేటలో చిరుతలు జింకల వంటి వీడియోలను చూస్తూనే వుంటాం. అయితే చిరుతలు మహా తెలివైన జంతువులని ఇటీవల వైరల్ అయిన వీడియోలోనే మనం చూశాం.
ఓ జింక పిల్ల దారి తప్పి అడవిలో ఒంటిరిగా ఆహారాం అన్వేషణ చేస్తుండగా, అటుగా వచ్చిన చిరుత.. దానికి కనబబడకుండా దాక్కుని.. చెట్టును అడ్డం చేసుకుని నక్కిుతు జింక పిల్ల వరకు చేరుకుంటుంది. ఒక్కసారిగా సన్నధమైన తరువాత దానిపై దాడికి పాల్పడి.. దానిని ఆహారంగా చేసుకుంది. ఈ వీడియోలోనే చిరుత తెలివిగా వేటాటడాన్ని మనం చూశాం. అయితే ఒకవేళ చిరుతే అహారంగా మారాల్సిన సందర్భంలో ఎలా తెలివిగా వ్యవహరిస్తుంది.? అప్పుడు కూడా చిరుత తెలివిగానే తప్పించుకునే తరోణోపాయం చేస్తుందా లేక.. ఆహారంగా మారుతుందా.? అన్న అనుమానం రాగానే.. చిరుతలను కూడా వెంటాడి వేటాడే జంతువులు అడువుల్లో వున్నాయా.? అన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయా.?
అడవికి రాజైన సింహాలు చిరుతలతో పోరాడి వాటిని అహారంగా మార్చుకుంటాయి. మరి మీరెప్పుడైనా సింహం, చిరుత మధ్య పోరాటాన్ని చూశారా.? ఇలాంటివి అత్యంత అరుదుగా జరుగుతుంటాయి. అంతేకాకుండా సమవుజ్జీల మధ్య పోరు అత్యంత భయానకంగా ఉంటుందని చెప్పాలి. అలాంటి పోరాటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణాప్రికాలోని టాంజానియాలో ఇదే తరహాలో సింహాల గుంపు చిరుతను చుట్టుముట్టిన నేపథ్యంలో చిత్రీకరించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సెరెంగేటి రిజర్వులో సింహలు.. చిరుతపులి మధ్య భీకర పోరు కనిపించింది. సింహాల బృందం చిరుతపై దాడి చేసింది.
అడవిలోని నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. జీవన చక్రం ప్రకారం ఆకులు అలుములు తినే జంతువులు.. ఇతర జంతువులకు ఆహారాంగా మారుతుండగా, ఈ జంతువులు క్రూర మృగాలకు ఆహారంగా మారుతుంటాయన్న విషయం తెలిసిందే. అడవిలో వేటాడపోతే.. ఆహరం లేనట్టే. ఆకలితో అలమటించాల్సిందే. ఈ క్రమంలోనే చాలా జంతువులు క్రూరమృగాల చేతులకు చిక్కి శల్యం కావడం మనకు తెలిసిందే. అయితే అడవికి రారాజైన సింహం.. చిరుతను వేటాడితే ఎలా వుంటుంది. ఈ రెండు జీవులు అద్భుతమైన వేటగాళ్ళు.. తమకు ఆహారం కావాల్సిన సమయంలో వేగాన్ని, వ్యూహాన్ని అమలు చేస్తూంటాయి. అయితే తాజాగా ఓ సింహాల గుంపు చిరుతను తమ ఎరగా చేసుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో సింహాలు అన్నీ కూడా చిరుతను చుట్టుముట్టాయి. దాన్ని ఎరగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక సింహం నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు చిరుత నేల మీద దొర్లుతూ.. చనిపోయినట్లుగా నటిస్తుంది. అయితే పక్క నుంచి ఓ సింహం వచ్చి అకస్మాత్తుగా చిరుతపై దాడి చేస్తుంది. సింహాల నుంచి తప్పించుకునేందుకు చిరుత దాడుల్ని మూసుకుపోయాయి. తన ప్రాణాలు రక్షించుకునేందుకు అనేక సార్లు సింహలతో చిరుత పోరాడుతుంది. ఇక చివరికి చిరుత తాను చనిపోయినట్లుగా నటిస్తూ.. సింహాలను పక్కదారి పట్టించి తప్పించుకోవాలని భావిస్తుంది. ఈ షాకింగ్ వీడియోను వరల్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అండ్ విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more