నిత్యం శ్రీవారి భక్తులకు పలు సేవలను తీసుకువచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అయితే శ్రీవారి భక్తుల కోసం తీసుకువచ్చే కార్యక్రమాలకు బదులు తమ ఖజానాలో అధికభాగం నిండిపోయిన నాణేలాను భక్తులకు అందించే తమ స్థలాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అదే శ్రీవారి ధన ప్రసాదం. ఈ కార్యక్రమం ద్వారా అటు టీటీడీకి లబ్ది చేకూరడంతో పాటు ఇటు భక్తులకు కూడా చిల్లర నాణేలు చేతిలో అందుబాటులో వుండే ఉభయుక్తమైన కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి టీటీడీ భక్తులకు అందజేస్తోంది.
శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిరోజు స్వామివారి హుండీలో రూ. 10 నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు వస్తుంటాయి. ఈ చిల్లరను తీసుకునేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. దీంతో, టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు పెరగిపోయాయి. అందుకే ఈ నాణేలను నోట్లుగా మార్చుకునేందుకు టీటీడీ ధన ప్రసాదం కార్యాక్రమాన్ని తీసుకొచ్చింది. తిరుమలలో అతిథిగృహాల రిసెప్షన్ కేంద్రాల వద్ద ధన ప్రసాదం రూపంలో నాణేలను 100 రూపాయల పాకెట్ల రూపంలో కవర్లలో అందిస్తోంది.
అకామడేషన్ బుకింగ్ సమయంలో చెల్లించిన కాషన్ డిపాజిట్ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో తిరిగి తెల్లించేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఒక రూపాయి నాణేలను ఇస్తున్నారు. రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేలను కూడా ఇవ్వబోతోంది. ఒకవేళ చిల్లర తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్ ను భక్తులకు చెల్లించనున్నారు. కవర్లో కాయిన్స్ తో పాటు పసుపు, కుంకుమ కలిపి అమ్ముతారు. కవర్ లోపల వంద రూపాయి కాయిన్స్ ఉంటాయి. వందరూపాయలు చెల్లించి ఆ ధనప్రసాదాన్ని తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కొనుక్కున్నట్టుగానే కాయిన్స్ ప్రసాదం తీసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more