ఓ భయంకరమైన ఘటన.. దగ్ధమవుతున్న కారు.. అగ్నికి ఆహుతవుతున్న కారులో ఇద్దరు వృద్ధ దంపతులు.. అప్పటికే మంటలు వ్యాపించడం, పోగబారడంతో వారు దిగలేక కారులో సృహకోల్పోయారు. దీంతో వృద్ద దంపతులు ఆ మంటలకు మాడి మసై పోతారేమోనని అనుకునే క్షణాలు.. నిప్పుకు వాయువు తోడై ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఎవరైనా ఏం చేస్తారు.. అగ్నిమాపక దళాలకు సమాచారం అందించి.. ఇక అంతా దేవుడి దయ అని అంటారు. కానీ అదే సమయంలో ఆ వైపు నుంచి ఓ కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వారిని గమనించి.. హుటాహుటిన వారిని కాపాడేందుకు బరిలోకి దిగారు.
వెనకాముందు ఆలోచించకుండా ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలను కూడా లెక్కచేయకుండా.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి.. ఆ వృద్ధ దంపతులను సురక్షితంగా కాపాడారు. కాలిఫోర్నియాలో వేగంగా వెళ్తున్న కారు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో తొంబై ఏళ్ల వయస్సులోని వృద్ధ దంపతులు ప్రయాణిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగి, పోగ అలుముకోవడంతో ఆ వాహనాన్ని సడెన్ గా ఆపేశారు. అప్పటికే తీవ్ర భయాందోళనకు గురైన వారిద్దరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే అప్పటికే పోగ కారును పూర్తిగా వ్యాపించి వారికి ఏమీ కనబడనీయకుండా చేసింది.
ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న వృద్ద మహిళ అప్పటికే సృహ కోల్పోయింది. అయితే అమెను బయట తీసే మార్గం కనిపించక అమె భర్త కూడా కారులో ఉండిపోయారు. ఈ క్రమంలో అదే రోడ్డు మార్గంలో కారులో వెళ్తున్న మరో ఇద్దరు వ్యక్తులు ఆ కారులో ఉన్న వృద్ధులను రక్షించేందుకు ప్రయత్నించారు. ఎగిసిపడుతున్న మంటలను సైతం లెక్క చేయకుండా.. కారు దగ్గరికి వెళ్లి.. అందులో ఉన్న ఇద్దర్నీ సురక్షితంగా బయటకు లాగారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వృద్ధ దంపతులను కాపాడిన ఆ ఇద్దరు హీరోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more