ఓ వర్గానికి చెందిన యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని తమ మతంలోకి మార్చుకుని పెళ్లి చేసుకుని వారిని అనేక ఇబ్బందులకు గురిచేసే చర్యే లవ్ జిహాద్. చాపకింద నీరులా గత కొన్నేళ్లుగా ఈ ట్రాప్ సాగిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా లవ్ జీహాద్ తరువాత ప్రస్తుతం నార్కోటిక్ జిహాద్‌కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబార్ చర్చ్ బిషప్ మార్ జోసెఫ్ కల్లరంగట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్రైస్తవ బాలికలను ఉగ్ర ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్న వారు ఆయుధాలు ప్రయోగించలేని చోట నార్కోటిక్స్‌ను వాడుతున్నారని అన్నారు. లవ్ జిహాద్లో యువతులను ప్రేమ పేరుతో ఆకట్టుకుని మతం మార్చేవారని, తాజాగా క్రైస్తవ యువతలో డ్రగ్స్ వాడకం తీవ్రమైందని ఇక్కడ ముస్లిమేతరులు ఎవరూ ఉండకూడదనే ఇదంతా చేస్తున్నారని, అందరూ అలాంటి గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బిషప్ హెచ్చరించారు. ఐఎస్ శిబిరాల్లో ఇతర మతాల మహిళలు ఎందుకు ఉన్నారో అందరూ పరిశీలించాలని కోరారు. డ్రగ్స్‌తో క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.
ముస్లిం ఆలోచనా సరళిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్ధలో కేరళ నుంచి పలువురు చేరుతున్నారని 2016లో తొలుత వార్తలు వచ్చాయి. 19 మంది గల్లంతైన వారు ఈ ఉగ్రసంస్ధలో చేరారని వారి కుటుంబ సభ్యలు, బంధువులు పేర్కొనడంతో విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను కోరింది. కాసర్‌ఘడ్, పలక్కాడ్ జిల్లాలకు చెందిన ఈ 19 మందిలో అత్యధికులు క్రైస్తవ, హిందూ మతాల నుంచి ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more