Angry Woman Crashes Sister Job Interview ఇంటర్వ్యూలో ఉన్న చెల్లిపై అక్క ముష్టిగాతాలు..

Angry woman crashes sister s job interview beats her up

viral video, viral video 2021, viral video alerts, sister viral video, sisters fight

A video that shows a woman crashing her sister’s job interview and thrashing her on finding that that the latter had slept with her husband. And, believe us or not, a video of the incident has gone viral and has left netizens ROFL-ing. The video went viral after it was shared on a Twitter account with the name Dallas and has racked up millions of views.

ITEMVIDEOS: జాబ్ ఇంటర్వ్యూలో జరుగుతుండగా, చెల్లిపై అక్క ముష్టిగాతాలు..

Posted: 09/13/2021 09:37 PM IST
Angry woman crashes sister s job interview beats her up

ఈ మ‌ధ్య ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ వీడియోల హ‌వా పెరిగిపోయింది. ఎంతటి దారుణ ఘటనలు జరిగినా.. వాటిని తమ సెల్ ఫోన్లలో బంధించి ఆ వీడియోలను నెట్టింట్లో పెట్టి మరీ ఆనందిస్తున్నారు కొందరు. ప్రమాదం జరిగినా.. సాయం చేయడం మానీ.. వీడియోలు తీస్తున్నారు.. సెలబ్రిటీలు అంత్యక్రియలకు హాజరైతే.. అక్కడ కూడా కొందరు తమ సెల్ ఫోన్లకు పనిచెబుతూ.. అక్కడ నెలకొన్న విషాద వాతావరణాన్ని మార్చేస్తున్నారు. లైకులు, వ్యూస్, కామెంట్స్ కోసం చేసే ఇలాంటి ఘటనల్లో ఎదుటివారితో పాటు బాధితులు కూడా ఎంతలా బాధపడతారో వీరికి అసలు పట్టించుకోరు.

అయితే ఇలాంటి ఘటనలనే వీరికి ఎదురైనప్పుడు మాత్రం వీరికి లిమిట్స్, లిమిటేషన్స్ గుర్తుకోస్తాయి. వింత‌లు, విచిత్రాల వరకైతే పర్వాలేదు.. కానీ మనిషి క్యారెక్టర్ తో ముడిపడిన అంశాలతో కూడిన వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తుండడం అక్షేపనీయం. తాజాగా ఇలాంటి మ‌రో కొత్త వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. ఆ వీడియోలో అక్కా చెలెళ్ల మధ్య ఘర్షణ కూడా నెట్టింట్లోకి ఎక్కింది. అంతేకాదు.. అక్క చెల్లిపై ఎందుకు అంతగా ఫైర్ అయ్యిందో కూడా పేర్కోంటూ పోస్టులో పోందుపర్చడం గమనార్హం. జాబ్ ఇంట‌ర్వ్యూ కోసం వ‌చ్చిన యువ‌తిని ఆ కంపెనీ ప్ర‌తినిధులు ఇంట‌ర్వ్యూ చేస్తుంటారు. స‌గం ఇంట‌ర్వ్యూ పూర్త‌వుతుంది.

స‌రిగ్గా అప్పుడే ఆ యువ‌తి అక్క‌ ఇంట‌ర్వ్యూ జ‌రుగుతున్న గ‌దిలోకి దూసుకొస్తుంది. ఇంట‌ర్వ్యూ చేస్తున్న కంపెనీ ప్ర‌తినిధుల ముందే త‌న చెల్లిని కుర్చీలోంచి లాగి కింద ప‌డేస్తుంది. అంత‌టితో ఆగ‌కుండా ఆమె మీద కూర్చుని ఎడాపెడా వాయిస్తుంది. చెల్లెలు రెండు చేతుల‌తో ముఖం దాచుకుంటున్నా అక్క మాత్రం ముఖాన్నే టార్గెట్ చేసి పిడి గుద్దులు గుద్దుతుంది. ఆ స‌మ‌యంలో యువ‌తి ఆగ్ర‌హాన్ని చూసి ఇంట‌ర్వ్యూ చేస్తున్న‌ కంపెనీ ప్ర‌తినిధులుగానీ, ఇత‌ర సిబ్బందిగానీ ఆపే సాహ‌సం చేయ‌లేదు.

కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఈ ఘ‌ట‌న‌ను త‌న ఫోన్ రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. చెల్లిపై అక్క ఎందుకు దాడి చేసిందో కూడా ఆ పోస్టులో వివ‌రించాడు. చెల్లి త‌న భ‌ర్తతో సంబంధం పెట్టుకుంద‌ని తెలుసుకుని, ఇంట‌ర్వ్యూ జ‌రుగుతున్న ఆఫీస్‌కు వ‌చ్చి మ‌రీ దాడి చేసింద‌ని వెల్ల‌డించాడు. దాంతో సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్‌ల నుంచి లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తున్న‌ది. కొంద‌రు నెటిజ‌న్‌లు అయితే ఈ వీడియోపై ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం ఒక‌సారి మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viral video  viral video 2021  viral video alerts  sister viral video  sisters fight  

Other Articles