Man Beaten Up With Hammer For Eloping కూతురి ప్రియుడిపై సుత్తితో తండ్రి, తనయుల దాడి..

Man beaten up with hammer by woman s family for eloping

Maksi police, Man beaten with hammer, Man elopes with woman, Police arrest victim, Madhya Pradesh attack,Shajapur, Madhya Pradesh, viral video

A 22-year-old man was brutally beaten up in Shajapur. The woman's father and brother, allegedly angry over the affair, confronted the man while he was out in the market and allegedly started beating him up with hammer-shaped rod.

ITEMVIDEOS: కూతురి ప్రియుడిపై సుత్తితో తండ్రి, తనయుల దాడి..

Posted: 09/14/2021 01:38 PM IST
Man beaten up with hammer by woman s family for eloping

తాము ప్రాణంగా కని పెంచి పెద్ద చేసిన కూతురిని.. ప్రేమ అనే రెండు అక్షరాలతో తమకు కాకుండా చేయడమే కాకుండా.. తమకు ఎదురుతిరిగేలా చేసి.. తమకు చెప్పకుండా ప్రియుడితో కలసి వెళ్లిపోవడానికి కారణమైన అమె ప్రియుడిపై అమ్మాయి కుటుంబం కక్ష పెంచుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమను కాదనుకునేలా చేసిన ప్రియుడి బుద్ది చెప్పాలనుకుంది. అంతే అమ్మాయి కుటుంబంలోని తండ్రి, తనయుడు ఇద్దరు కలసి అమె ప్రియుడిని స్థానిక మార్కెటులో అందరూ చూస్తుండగా.. దారుణంగా కొట్టారు. సుత్తిలాంటి ఆయుధంతో ప్రియుడ్ని చేతులు, కాళ్లపై దారుణంగా కోట్టారు.

సామాజిక మాధ్య‌మాల్లో ప్రస్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ షాజ‌పూర్ జిల్లాలోని మాక్సి సిటీకి చెందిన పుష్ప‌క్ భ‌వ్‌సార్ (22) స్థానికంగా ఓ యువ‌తిని గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చయించుకున్న ఆ ఇద్ద‌రూ.. అయితే ఈ క్రమంలో తమ కుటుంబసభ్యుల నుంచి తీవ్ర ప్రతికూలత వస్తుందని గ్రహించిన ఇద్దరూ ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా వెళ్లిపోయారు. దీంతో ఇరువురు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే స్థానిక పెద్దలతో పాటు రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకుని ఇద్దరు కలసి ఇష్టాంగానే వెళ్లిన తరువాత దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీంతో కుటుంబసభ్యలు పరువు మర్యాదలకు విఘాతం కలిగేలా ప్రవర్తించవద్దని.. ప్రేమికులకు కూడా సూచించారు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదర్చి.. మికులను విడివిడిగా ఉండేలా పెద్దలు వారిని ఒప్పించారు. దీంతో ఆ ప్రేమికులిద్ద‌రూ తిరిగి త‌మ నివాసాల‌కు చేరుకున్నారు. అయితే తమ బిడ్డను తీసుకుని పోవడంపై అమ్మాయి కుటుంబం మాత్రం కోపాన్ని దిగమింగుకోలేకపోయింది. దీంతో తమ బిడ్డ ప్రియుడిపై అమ్మాయి తండ్రి, సోద‌రుడు దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. హెయిర్ కట్ కోసం మార్కెట్‌కు వెళ్లిన పుష్ప‌క్ ను షాపు నుంచి బయటకు తీసుకోచ్చి సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఈ దృశ్యాల‌ను కొంద‌రు త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై మాక్సి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles