Punjab man injured in bike's fuel tank blast ఇదెక్కడి చోద్యంరా బాబు.. పేలిన బైక్ పెట్రోల్ ట్యాంకు

Bike fuel tank blast biker critically injured in punjab

Biker, bike blast, bike petrol tank blast, bike fuel tank blast, Rider injured, Cousin brother, forensic team, investigation, jalalabad, Punjab, Crime

A biker in Punjab's Jalalabad district got critically injured after a blast in his bike's fuel tank. Police said that the boy was 22-year-old and was coming from his relative's home when the accident took place. Immediately after the accident, the injured was admitted to the hospital.

ఇదెక్కడి చోద్యంరా బాబు.. పేలిన బైక్ పెట్రోల్ ట్యాంకు

Posted: 09/16/2021 01:05 PM IST
Bike fuel tank blast biker critically injured in punjab

ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు పేలడం గురించి విన్నాం. కొన్ని ఘటనలు కళ్లకు కట్టినట్లు కూడా చూశాం. ఈ ఘటనల్లో కొందరు మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో అసుపత్రుల పాలయ్యారు. అయితే ఎక్కడ లేని విధంగా, మునుపెన్నడూ వినని విధంగా ఓ బైక్ పెట్రోల్ ట్యాంకు పేలుడు సంభవించడం విచిత్ర ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ ఫోన్ మాట్లాడితే వాటి రేడియో ధార్మిక తరంగాలతో ఒక్కసారిగా పెట్రలోకు మంటలు అంటుకున్న తద్వారా బైక్ లకు అవి వ్యాపించిన ఘటనలను కూడా చూశాం.

కానీ పంజాబ్ లో మాత్రం నిన్న రాత్రి బైక్ పై ఇంటికి వెళ్తున్న యువకుడి బైక్ లో ఒక్కసారిగా బైక్‌ ట్యాంక్‌ పేలింది. దీంతో బైక్ పై ఉన్న అతడు తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్ లోని జలాలాబాద్ లో జరిగింది. ఫజికా జిల్లాలోని జలాలాబాద్ కు చెందిన ఓ యువకుడు బుధవారం రాత్రి తన బైక్‌పై వెళ్తున్నాడు. మరో రెండు నిమిషాల్లో తన గమ్యస్థానికి చేరుకుంటాడనగా అనూహ్యంగా అతని బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. అసలేం జరిగిందో తెలుసుకునే లోపు వాహనచోదకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడితో పాటు అతని సోదరుడు కూడా మరో బైక్ పై వచ్చాయడని స్థానికులు తెలిపారు. అయితే బైక్ పెట్రోల్ ట్యాంకు బ్లాస్ట్ సంభవించగానే అతను తన బైక్ ను కూడా అక్కడే వదిలేసి పారిపోయాడని స్థానికులు తెలిపారు. కాగా, అసలు బైక్ లో ఎందుకు పేలుడు సంబంధించిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ విషయాన్ని తేల్చడానికి ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగి ఘటనపై విచారణ నిర్వహించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles