WHO thanks India for Covid-19 vaccine భారత్ కు కృతజ్ఞతలు తెలిపిన డబ్యూహెచ్ఒ

Who chief thanks india for resuming export of covid 19 vaccine

Tedros Adhanom Ghebreyesus, Mansukh Mandaviya, WHO chief Afghanistan, WHO chief meets Taliban leaders, COVAX, COVAX India, india COVAX, india vaccine export COVAX, WHO, India, corona vaccine, export of covax, National politics

World Health Organisation (WHO) Director-General Tedros Adhanom Ghebreyesus thanked India for resuming the export of Covid-19 vaccines in order to fulfil its commitment towards COVAX. "Thank you Health Minister Mansukh Mandaviya for announcing India will resume crucial Covid-19 vaccine shipments to COVAX in October," tweeted Ghebreyesus on Wednesday.

భారత్ కు కృతజ్ఞతలు తెలిపిన డబ్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్

Posted: 09/22/2021 04:02 PM IST
Who chief thanks india for resuming export of covid 19 vaccine

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఒ) భారత్ కు కృతజ్ఞతలు తెలిపింది. డబ్యూహెచ్ఒ సంస్థ డెరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రెయేసస్ భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు. యావత్ ప్రపంచం అరోగ్యంగా వుండేందుకు.. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రపంచ ప్రజలను నియంత్రించేందుకు భారత్ అందిస్తున్న వాక్సీన్ దోహదం చేస్తోందని ఆయన అన్నారు. భారత్ తో రెండో దశ తీవ్ర ప్రభావం చూపడంతో ప్రపంచదేశాలకు వాక్సీన్లును ఎగుమతి చేసే ప్రకకు బ్రేకులు పడ్డాయి. దేశంలో వాక్సీన్ కొరత కూడా ఏర్పడింది. కాగా ఇక వచ్చే నెల నుంచి ప్రపంచ దేశాలకు వాక్సీన్లను ఎగుమతి చేస్తామని భారత్ ప్రకటించింది.

అక్టోబర్‌లో కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించినందుకు ఆయన ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందన్నారు. ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా.. కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి భారత్‌ అండగా నిలిచింది.  రెండోదశలో మహమ్మారి విజృంభణతో టీకాల ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు అందించాలని నిర్ణయించింది. భారత్‌లో అదనంగా ఉన్న కొవిడ్​ టీకాలను ‘వ్యాక్సిన్​మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. మంగళవారం వరకు దేశంలో 82కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles