Nasa records biggest 4.2 magnitude quake on Mars గంటన్నర పాటు వణికిన అంగారకుడు.. రికార్డు చేసిన నాసా

Nasa mars robot hears planet grumble during 90 minute long marsquake

Mars Marsquake, What is marsquake, Science, Mars Mission, Science News, Nasa InSight lander, Marsquake magnitude, insight, symantec insight, honda insight, verbatim insight, netgear insight

The InSight lander, which has fixed its ears to the Martian ground, has heard some of the biggest rumblings under the surface. The Nasa probe has now detected the biggest and longest-lasting quake on Mars measuring a magnitude 4.2 that shook the ground for nearly an hour-and-a-half.

గంటన్నర పాటు వణికిన అంగారకుడు.. రికార్డు చేసిన నాసా

Posted: 09/23/2021 03:36 PM IST
Nasa mars robot hears planet grumble during 90 minute long marsquake

భూగ్రహం మాత్రమే కంపిస్తుందని అనుకుంటే పోరబాటే. ఎందుకంటే గ్రహాలన్ని కంపిస్తాయన్న విషయం ఇప్పుడిప్పుడే అవగతం అవుతోంది. అదెలా అంటే అంగారక గ్రహంపై వున్న అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండ‌ర్ మార్స్ అక్కడ పక్రంపనలను రికార్డు చేసింది. 2019లో తొలిసారి ల్యాండర్ అక్కడ ప్రకంపనలను రికార్డు చేసింది. ఆ తరువాత గత నెల రెండు సార్లు, ఈ నెలలో ఒకసారి ఇదే తరహాలు అక్కడి గ్రహంపై ప్రకంపనలు గుర్తించింది. ఇది 4.2 తీవ్రతతో ఏకంగా గంటన్నర పాటు ప్రకంపనల తీవ్రత కొనసాగినట్లు తెలిపింది.

ఇదే ఇప్ప‌టివ‌ర‌కూ మార్స్‌పై మాన‌వాళికి తెలియ‌ని అతిపెద్ద‌, సుదీర్ఘ ప్రకంపనలని ఇన్ సైట్ ల్యాండర్ గుర్తించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. ఈ నెల 18న 4.2 తీవ్ర‌త‌తో వ‌చ్చిన ఈ ప్ర‌కంప‌న‌లు.. ఏకంగా గంట‌న్న‌ర పాటు సాగిన‌ట్లు తెలిపింది. దీనిని 2019లో వచ్చిన ప్రకంపనలతో పోల్చితే ఐదు రెట్టు అధిక ప్రభావవంతమైనది నాసా పేర్కోంది. అయితే నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇలాంటి ప్ర‌కంప‌న‌లు మూడోసారి క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. గ‌త నెల 25న ఇన్‌సైట్ త‌న సీస్మోమీట‌ర్‌లో 4.2, 4.1 తీవ్ర‌త క‌లిగిన రెండు భూకంపాల‌ను గుర్తించింది.

ఇక ఇన్ సైట్ ల్యాండ‌ర్ తనకు 8500 కిలోమీట‌ర్ల దూరంలో సంభవించిన ప్రకంపనలను కూడా గుర్తించిందని, అంత దూరంలో వ‌చ్చిన ప్ర‌కంప‌న‌ల‌ను ఇన్‌సైట్ గుర్తించ‌డం ఇదే తొలిసారని నాసా పేర్కోంది. ఇక ల్యాండర్ సాయంతో ప్రస్తుతం భూకంప కేంద్రాన్ని గుర్తించే ప‌నిలో నాసా శాస్త్ర‌వేత్త‌లు ఉన్నారు. దీనితో పాటు సాధారణంగా రాత్రి పూట‌, గాలులు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో ఇన్‌సైట్‌లోని సీస్మోమీట‌ర్ ఈ మార్స్ కంపాల‌ను గుర్తించేది. అయితే ఈసారి మాత్రం ప‌గ‌టి స‌మ‌యంలో ప్ర‌కంప‌న‌లను ఇన్‌సైట్ రికార్డ్ చేసింది. 2018, మార్చిలో ఈ ఇన్‌సైట్ ల్యాండ‌ర్ మార్స్‌పై దిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles