కరోనా వైరస్.. ఈ మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మందిని బలి తీసుకోగా, కోట్లాధి మందిని తన ప్రభావానికి గురిచేసింది. ఇక దీని పేరు చెబితేనే ప్రజలు భయకంపితులు అవుతున్నారు. ఇలాంటి కరోనా మహమ్మారికి వైద్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఎప్పుడు అంతం పలుకుతారా అని వేచిచూస్తున్న తరుణంలో దీనికి అంతం లేదన్న వార్త వినిపిస్తోంది. అయితే అంతం లేకపోవచ్చు కానీ.. దాని ప్రభావం కూడా ఇకపై చాలా తక్కువగా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది సాధారణ జలుబుగా కరోనా వైరస్ మారిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వైరస్‌కు చాలా కాలంగా అలవాటు పడి ఉండటం, వ్యాక్సిన్ల కారణంగా ప్రజల రోగనిరోధక శక్తి పెరగడంతో కరోనా ఓ సాధారణ జలుబుగా మారిపోతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్ జాన్ బెల్ అంటున్నారు. ఈ వైరస్ వల్ల యూకే చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించిందని, శీతాకాలం దాటితే చాలు పరిస్థితులు మెరుగవుతాయని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే.. ఆరు నెలల కిందటి కంటే చాలా మెరుగ్గా ఉంది అని జాన్ బెల్ అన్నారు. యూకేలో కొవిడ్ మరణాలు కూడా చాలా వరకూ వయసు మళ్లిన వారిలోనే సంభవిస్తున్నాయని, అవి కూడా పూర్తిగా కొవిడ్ కారణంగానే అని స్పష్టంగా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం యూకేలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. ఇప్పటికే వైరస్ బారిన పడిన వాళ్లు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు హెర్డ్ ఇమ్యూనిటీకి తోడ్పడతారని ఆయన చెప్పారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్ కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువైన కొద్దీ అవి బలహీనపడతాయని చెప్పారు. ఆమె అభిప్రాయంతో జాన్ బెల్ ఏకీభవించారు. తన అభిప్రాయం మేరకు ఆ పరిస్థితి వచ్చే ఏడాది వసంత కాలం కల్లా వస్తుందని అన్నారు. కొవిడ్ నుంచి మరో భయానకమైన వేరియెంట్ వచ్చే అవకాశాలు తక్కువని కూడా సారా గిల్బర్ట్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more