కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ గత 10 నెలలుగా రైతు సంఘాలు చేస్తున్న నిరసనలు తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న తరుణంలోనూ కేంద్రం స్పందిచకపోవడంపై నిరసనగా రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్ లో రైతు సంఘాలతో పాటు కార్మికుల సంఘాలు, ప్రగతిశీల సంస్థలు మరియు ఇతర పౌర సమాజ సంఘాల మద్దతుతో అందించబడిన భారత్ బంద్ పిలుపుకు సోమవారం అపూర్వమైన స్పందన లభించింది, ప్రజలు మత, కుల, ప్రాంతీయ సంఘాలతో పాటు విపక్షాలు కూడా మద్దతునివ్వడంతో విజయవంతంగా కొనసాగుతోంది.
భారత్ బంద్ లో భాగంగా పంజాబ్, హర్యానాలో, నిరసనకారులు రాస్తారోకోలు చేపట్టి ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకున్నారు. మరికోందరు రైలు రోకోను నిర్వహించడంతో అనేక రైళ్లు నిలిచిపోయాయి, దీంతో ఉదయా నుంచే ఉత్తరాది రాష్ట్రాలలో జనజీవనం స్తంభించింది. భారత్ బంద్ లో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసనకారుల ప్రదర్శనలు ప్రతి గ్రామం నుండి ప్రతిధ్వనించాయి, ఒక గ్రామం తరువాత మరోకటి ఉదయం నుంచే నిరసనలకు దిగడంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో భారత్ బంద్ విజయవంతంగా కోనసాగుతోందని నివేదికలు వస్తున్నాయి.
రైతు సంస్థలు ఉత్తరాఖండ్‌లోని బాజ్పూర్, రాజస్థాన్‌లోని ఝున్ ఝును, తమిళనాడులోని మధురై, కేరళలోని తిరువనంతపురం, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, జార్ఖండ్‌లోని రాంచీ, బీహార్‌లోని పూర్నియా సహా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో నిరసనలు ప్రతిధ్వనిస్తున్నాయి, దేశ రాజధాని వెలుపల రైతుల నిరసన 10 నెలలు పూర్తయిన సందర్భంగా బంద్ జరిగుతోంది. ఈ నిరసనల సమయంలో 600 మందికి పైగా మరణించినప్పటికీ వారితో చర్చలు జరపడానికి నిరాకరించిన కేంద్రప్రభుత్వం యొక్క "అహంకార, అమానవీయ" వైఖరిపై కోపంతో వారు ఢిల్లీ శివార్లలో రైతు సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు "కార్పొరేట్ అనుకూల" కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా ఉన్నాయని నిరసన తెలుపుతూ పంజాబ్ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు హర్యానాు, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పాకింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్న తరుణంలో రైతులు ఈ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ప్రధాని అమెరకా పర్యటన నిరసిస్తూ భారతదేశ వ్యవసాయ సంఘాలతో పాటు పలు వర్గాలకు చెందిన ప్రజలు భారత్ బంద్ పిలుపులో స్వచ్చందంగా పాల్గోన్నారు. రైతు సంఘాల నిరసనలను కేవలం సిక్కులు, భారతీయ సంఘాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అనేక సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నాయి.
ఇక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో గుర్గావ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ బంద్ నేపథ్యంలో ఢిల్లీలోకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా పరిశీలించి వదులుతున్నారు. దీంతో వందల సంఖ్యలో కార్లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. 40 రైతు సంఘాలు భాగంగా ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిరసనలు చేపట్టనుంది. నేషనల్ హైవేలను దిగ్బంధించడంతోనూ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాలలో రైతు సంఘాల ఆద్వర్యంలో అనేక మంది రైతులు రైల్ రోకో కార్యక్రమాలు చేపట్టారు, రైల్వే ట్రాకులపైనా బైఠాయించడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు మూసివేశారు.
Massive traffic snarl seen at Gurugram-Delhi border as vehicles entering the national capital are being checked by Delhi Police and paramilitary jawans, in wake of Bharat Bandh called by farmer organisations today. pic.twitter.com/dclgkqp3X1
— ANI (@ANI) September 27, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more