Groom breaks down during vidaai ceremony అప్పగింతల వేళ.. వెక్కి వెక్కి ఏడ్చిన వరుడు

Viral video groom breaks down during vidaai ceremony

wedding video, viwedding video, viral wedding video, groom cries at wedding, groom looks at bride and cries, dulha Roya, dulha dulhan ka pyaar, bride groom drama at wedding, groom laughs at bride, trending video, Dil todya Satbir Aujla, viral trending videos

Now a video of a groom teasing his bride during the vidaai ceremony has gone viral. In the video, the groom can be seen crying in order to pull the bride’s leg. In the video that has gone viral, a groom and his bride can be seen sitting in the car for vidaai.

ITEMVIDEOS: అప్పగింతల వేళ.. వెక్కి వెక్కి ఏడ్చిన వరుడు

Posted: 09/28/2021 07:43 PM IST
Viral video groom breaks down during vidaai ceremony

వివాహ వ్యవస్థకు మన సమాజంలో చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లి వేడుక అంటే మన దగ్గర ఎంత లేదన్నా.. మూడు, నాలుగు రోజలు పాటు కొనసాగుతుంది. ఇక పెళ్లి ఇంట్లో సరదాలు, సందళ్లకు కొదవే ఉండదు. అయితే కాలంతో పాటుగా పెళ్లిలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెళ్లి మంటపాల్లో చోటు చేసుకుంటున్న వెరైటీ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

సాధారణంగా పెళ్లి తర్వాత జరిగే అప్పగింతల వేడుకల సమయంలో వధువు ఏడుస్తుంది. కన్నవారిని.. తోబుట్టువులను.. స్నేహితులను వదిలి.. పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వెళ్తున్న వేళ.. ఆడపిల్లలు ఏడవడం సహజం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అప్పగింతల వేళ​.. వధువు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అందరికి వీడ్కోలు పలుకుతుండగా.. వరుడు మాత్రం.. కన్నీరు పెట్టుకుంటాడు. అది గమనించిన వధువు.. అతడిని తట్టి.. ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది.

కన్నీరు పెడుతున్న పెండ్లి కుమారుడిని చూసి అక్కడున్నవారంతా నవ్వుతారు. ఇక పెళ్లి కుమార్తె అతడిని చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత అతడు కూడా కళ్లు తుడుచుకుని.. నవ్వుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘ఇతగాడికి పెళ్లైన మొదటి రోజునే ఫ్యూచర్‌ ఎలా ఉండబోతుందో అర్థం అయినట్లుంది’’.. ‘‘ఇంత బాగా ఏడ్చే పెళ్లి కుమారుడిని నేను ఇంతవరకు చూడలేదు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles