కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి.. పార్టీ యువనేత జ్యోతిరాధిత్య సింధియా వర్గాన్ని నిట్టనిలువునా విడదీసి తమలో విలీనం చేసుకుని.. అధికార పీఠాన్ని అధిరోహించిన శివరాజ్ సింగ్ పాటిల్ మరోమారు ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మద్దతు పలుకుతూ జోరుగా నినాదాలు చేస్తూ.. తన నినాదాలకు పార్టీ కార్యకర్తలను నుంచి వస్తున్న ప్రతిస్పందనలో తనను తాను మైమర్చిన ఓ బీజేపి నేత.. వేదికపై నుంచి ఒక్కసారిగా కిందపడి స్వల్ప గాయాలపాలయ్యారు.
మధ్యప్రదేశ్ ఖార్గోన్ జిల్లాలోని చైన్ పూర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి కెమెరాలకు చిక్కింది. దానిని సామాజిక మాద్యమాల్లో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రచారంలో భాగంగా చైనా పూర్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు.
బీజేపీ అభ్యర్థుల విజయం కోరుతూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం చౌన్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం చౌహాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే బీజేపీ నేత జగదీష్ జైస్వాల్ మైక్ లో ఆయనకు మద్దతుగా నినాదాలు ఇస్తూ కార్యకర్తలను ఉత్తేజపర్చారు. ఈ సందర్భంగా స్టేజ్ అంచున ఉన్న ఆయన ఆ విషయాన్ని గ్రహించక స్టేజ్ పైనుంచి కింద పడ్డారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లేవనెత్తారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై పలు ఈమోజీలతో భిన్నంగా స్పందించారు.
कई बार राजनैतिक सभाओं में ऐसे नज़ारे भी देखने को मिलते है। video खरगोन जिले के चैनपुर की सभा का #election @BJP4MP @INCMP @shubhjournalist pic.twitter.com/LL0SD3NPf3
— Deepti Chaurasia (@deepti_32) September 28, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more