కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం ఇప్పటికే ఎంతో మంది సాధారణ భక్తులు వేచిచూస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ రెండో దశ అన్ లాక్ నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఆంక్షలతో శ్రీవారి దర్శనభాగ్యం సామాన్య భక్తులకు అందకుండా పోయింది. కేవలం ప్రత్యేక దర్శన టోకన్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమితస్తూ టీటీడీ తొలుత నిర్ణయం తీసుకుంది. దీంతో వడ్డీకాసుల వాడు కేవలం సంపన్న భక్తులకు మాత్రమే దర్శనమిచ్చేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సామాన్య భక్తుల నుంచి పెద్దఎత్తున విన్నపాలు రావడంతో టీటీడీ ఈ విషయమై సమీక్షించింది.
దీంతో గత నెల నుంచి సామాన్య భక్తులకు కూడా శ్రీనివాసుడి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుని అమలు పర్చేలా చర్యలు తీసుకుంది. అయితే తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన రెండు వేల మంది శ్రీవారి భక్తులకు ఈ అవకాశం కల్పించింది. కాగా, గత నెల 24 నుంచి ఈ టోకన్ల సంఖ్యను రాష్ట్రవ్యాప్త సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ టోకన్ల సంఖ్యను ఏకంగా ఎనమిది వేలకు పెంచుతూ సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా, ఈ టోకన్లు హాట్ కేకుల్లా గంట వ్యవధిలోనే అయిపోయాయి. దీంతో మరోసారి టీటీడీ ఈ టోకన్ల సంఖ్యను పెంచుతుందని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో టీటీడీ సామాన్య భక్తులకు షాకింగ్ న్యూస్ వెలువరించింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను ఇప్పుడప్పుడే పెంచే యోచన లేదని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మహమ్మారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతోనే తాము సర్వదర్శన టోక్లన సంఖ్యను మరింతగా పెంచడం లేదని పేర్కొన్నారు. దీంతో స్వామివారి దర్శనం చేసుకోవాలని భావించే సామాన్యభక్తుల ఆశలు అడియాలవుతున్నాయి. కొవిడ్ పరిస్థితులపై ఈ నెలాఖరున సమీక్షించిన అనంతరం టోకెన్ల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
భక్తుల కోరిక మేరకే సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం ప్రారంభించామని, తొలుత రోజుకు రెండు వేలు ఇచ్చామని, ఆ తర్వాత వాటి సంఖ్యను 8 వేలకు పెంచినట్టు వివరించారు. పురటాసి మాసాన్ని పురస్కరించుకుని తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నట్టు చెప్పారు. దీంతో కొవిడ్ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కాబట్టే సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నామని, ఇప్పుడప్పుడే భక్తుల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ కలిగి ఉండాలని, ఒక్క డోసు తీసుకున్నా దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ నెల ఏడో తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, అప్పటి నుంచి అలిపిరి కాలినడక మార్గంలో భక్తుల రాకకు అనుమతిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు చెప్పిన జవహర్‌రెడ్డి.. ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more