యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరూ దేశి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆద్యాత్మిక భావనలో తన్మయత్వం పొందుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇదే అదునుగా భావించి వంటగ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రప్రభుత్వ, చమురు కంపెనీల తీరును నిరసిస్తూ తెలంగాణ మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కాగా, అదే పండుగ సంబరాన్ని తమ నిరసనను వ్యక్తం చేసేందుకు పూనుకున్నారు. తమ ఉత్సవాలతో పాటు నిరసనలను కూడా ఒకే వేదిక నుంచి కేంద్రానికి తెలియజేశారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు బతుకమ్మల మధ్య సిలిండర్లను పెట్టి తమ నిరసనను తెలిపారు. ఇక పెంచిన గ్యాస్ ధరలకు.. రోజురోజుకీ పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ.. అప్పటికప్పుడే ట్యూన్లు కట్టి మరీ పాటలను పాడుతూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గతంలో దసరా, దీపావాళి, సంక్రాంతి లాంటి పండుగలు వచ్చినప్పుడు.. తాము కూడా పండుగ పూట ఉత్సాహంగా ఉండాలని ప్రభుత్వాలు తమకు పలు వస్తువులను కారుచౌకగా అందించేవని అన్నారు.
రేషన్ దుకాణాలలో కంది, శనగ పప్పులతో పాటు పంచధార, వంట నూనె, గోదుమలు ఇవీ కాక పలు రకాల వస్తువులను కూడా మార్కెట్ రేటు కన్నా చౌకగా అందించేవారని.. పండగ అంటే అందరిదనీ.. దీంతో పేదవాళ్లు కూడా పండగ జరుపుకోవాలని ప్రభుత్వాలు ఇలా తమకు చౌకగా అందించేవన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలు రేషన్ దుకాణాలను బియ్యానికి మాత్రమే పరిమితం చేశాయని, పేదలు గొదుమ రెట్టెలు, శనగపిండితో వంటకాలు చేసుకోకూడదనా.? చక్కర, వంట నూనెలను అసలు అందించమే మానేశాయని వాపోయారు.
ఇది చాలదన్నట్లు ఇక పండగ వేళ.. తమ జేజులోని డబ్బులన్నీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ పేరుతో లాక్కోవడం మరింత దారుణమన్ని అక్షేపించారు. బతుకమ్మల మధ్యలో సిలిండర్ పెట్టి ఆటలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. గడిచిన రెండు నెలల్లో వంటగ్యాస్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్‌పై రూ.205 పెరిగింది. దీంతో సామాన్యులకు గ్యాస్ ధరలు గుదిబండలా మారాయి. మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోననంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు బిజెపి నాయకులు పండగ తో చేసిన ఫేక్ ప్రచారాన్ని వారికి బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెబుతూ తిప్పికొట్టిన హుజూరాబాద్ మహిళలు .... pic.twitter.com/8uTnBHH7Xs
— krishanKTRS (@krishanKTRS) October 6, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more