ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ సహా ఆయన సతీమణికి కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం ఇవాళ ఈ ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని ఐఆర్ఎస్ అధికారులు అనేకమంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న అరోపణలు వినిపించాయి. దీనిపై స్పందించిన కేంద్రం 2016లో దేశవ్యాప్తంగా ఐఆర్ఎస్ అధికారుల ఇళ్లలో సోదాలను నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఆదిమూలపు సురేశ్ సతీమణి విజయలక్ష్మి కూడా ఐఆర్ఎస్ అధికారి కావడం చేత.. అప్పట్లో వారి ఇంట్లోనూ సీబిఐ తనిఖీలు చేపట్టింది. 2017లో అదిమూలపు సురేష్, అతని భార్య విజయలక్ష్మిలపై కేసును కూడా నమోదు చేసింది. దీంతె తన ఇంట్లో జరిగిన సీబిఐ తనిఖీలను వ్యతిరేకిస్తూ ఆదిమూలపు సురేష్ తెలంగాణ హైకోర్టును అశ్రయించారు. అయితే విచారణ జరిపిన తరువాత న్యాయస్థానం.. అదిమూలపు సురేష్ దంపతులు మోపిన అభియోగాలను తోసిపుచ్చింది.
కాగా 2010–2016 మధ్య వారి ఆస్తులు ఆదాయానికి మించి 22 శాతం ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వారిద్దరి ఆదాయం రూ.4.84 కోట్లే కాగా.. అంతకుమించి రూ.5.95 కోట్ల ఆస్తులున్నాయని తేల్చారు. దీంతో వారిద్దరిపై సీబీఐ కేసును నమోదు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు.. మరోమారు కేసును రిజిస్టర్ చేసి.. ప్రాథమిక విచారణ జరపాలని సిబిఐని అదేశించింది. దీంతో న్యాయస్థానంలో తాము ఆశించిన మేర తీర్పు రాకపోవడంతో అదిమూలపు సురేష్ దంపతులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ కేసును విచారించిన తరువాత ఇవాళ సిబిఐకి అనుకూలంగానే తీర్పునిచ్చింది. గతనెల 22న సుప్రీంకోర్టులో వాదనలు ముగియగా, ఇవాళ తీర్పును వెలువరిస్తూ న్యాయస్థానం సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more