బాల్య వివాహల సవరణ బిల్లుపై రాజస్థాన్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నది. దేశ సర్వోన్నత న్యాయస్థానం అదేశానుసారం ఇకపై జరిగే వివాహాలను అన్నింటినీ రిజిస్టర్ చేయాలని.. అందులో మైనర్ల వివాహాలను కూడా రిజిస్టర్ చేయాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సవరణలు చేసింది. అయితే బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన ప్రభుత్వాలే అధికారికంగా దానిని ప్రోత్సహించేలా చట్టాలను తీసుకురావడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గెహ్లాట్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్దకు పంపిన బాల్యవివాహాల సవరణబిల్లును వెనక్కి తీసుకురానుంది. ఈ మేరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి సీఎం గెహ్లాట్ చెప్పారు.
నిజానికి రాజస్థాన్ లో బాల్యవివాహాల సంఖ్య ఎక్కువ. అయితే ఆ ఆచారాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తచట్టం తీసుకువచ్చింది. బాల్యవివాహలను అడ్డుకునేందుకు ఆ పెళ్లిళ్లు రిజిస్టర్ చేయాలన్న చట్టాన్ని తెచ్చారు. అయితే ఆ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటాయి. మైనర్ వివాహాలను రిజిస్టర్ చేయాలని కోరితే, దాని వల్ల బాల్య వివాహాలను ఎంకరేజ్ చేసినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలు ఒకవేళ పెళ్లి చేసుకుంటే, వాళ్లు కచ్చితంగా పెళ్లి రిజిస్టర్ చేయాలని కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టం పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
బాల్య వివాహాలను రూపుమాపాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో తామేమి వెనుకడుగు వేయబోమన్నారు. అన్ని పెళ్లిళ్లు రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే కొత్త చట్టాన్ని రూపొందించినట్లు గెహ్లాట్ చెప్పారు. కానీ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో గవర్నర్ వద్ద ఉన్న సవరణ బిల్లును వెనక్కి రప్పించనున్నట్లు సీఎం గెహ్లాట్ వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన బాల్య వివాహాల సవరణ బిల్లును పాస్ చేశారు. కానీ ఆ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ.. సభ నుంచి వాకౌట్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more