Groom Tears Up As Bride Dances For Him వధువు డాన్స్ చూసి కళ్లు చమర్చిన వరుడు..

Groom tears up as bride dances to main teri ho gayi during wedding festivities

Bride Groom Video, Dulha Aur Dulhan Ka Video, Dulhan Ka Dance, Dulhan Ka Video, Shadi Ka Video, Marriage Video, Viral Video, Viral Video Today, Trending Video, Trending Video Today

A man who teared up a little on his wedding for a heartwarming reason. So, the bride dedicated a beautiful performance to him and the groom couldn’t hold back his tears. The sweet video has now gone viral on social media and we are sure that you will love it too.

ITEMVIDEOS: వధువు డాన్స్ చూసి కళ్లు చమర్చిన వరుడు.. ఆనందంలో..

Posted: 10/18/2021 05:33 PM IST
Groom tears up as bride dances to main teri ho gayi during wedding festivities

నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. ఇలాంటి ప్రేమను ఏ రూపంలో వ్యక్తపరిచినా అది ఎదుటివారికి తప్పక  చేరుతుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే నానుడి మాత్రం ముమ్మాటికీ నిజమనే చెప్పాలి. ఎవరు ఎవర్ని ఎలా పెళ్లి చేసుకున్నా అవన్నీ దేవుడు రాసిన రాతల ప్రకారమే జరుగుతాయన్నది నూటికి నూరుపాళ్ల నిజం. దేవుడు రాయబట్టే ప్రతి ఒక్కరి జీవితంలోకి తమకు అనుకూలమైన వారు జీవిత భాగస్వామిగా వస్తారు. ఒకరినోకరు అర్థం చేసుకుని నూరేళ్ల దాంపత్య జీవితాన్ని అస్వాదిస్తుంటారు.

ఇందులో కొన్ని జంటలు మాత్రం మరింత ప్రత్యేకం. వీరిపై దేవుడి వరం కురిసినట్టుగానే వుంటుంది. వీరు చేసే ప్రతీ పనిలోనూ తన భాగస్వామిపై చూపించే ప్రేమ హృదయాలను తాకుతుంది.. ఆ ప్రేమను పొందే ఆనంద క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఓ పెళ్లిలో చోటుచేసుకుంది. ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో తెలియదు కానీ ఓ వివాహ వేడుకలో వధువు తన ప్రేమను వరుడికి తెలిపి అతన్ని ఆశ్చర్యపరచాలని అనుకుంది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు నేను నీ దాన్ని అనేలా ఓ పాటకు వరుడు ముందు డ్యాన్స్‌చేసింది.

సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలోని ‘మెయిన్ తేరి హో గయి’ పాటకు స్టెప్పులేసింది. అయితే వధువు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో వరుడు మెస్మరైజ్‌ అయ్యాడు. భార్య డ్యాన్స్‌ చూసిన వరుడు ఎమోషనల్‌ అయ్యాడు. ఆనందంతో కంటనీరు పెట్టుకున్నాడు. అనంతరం వధువు వుడిని చేయిపట్టుకొని స్టేజ్‌ మీదకు తీసుకెళ్లి కన్నీళ్లు తుడిచింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేయడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వరుడి భావోద్వేగం విలువకట్టలేనిదని.. క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by WedAbout.com (@wedabout)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : groom  bride  dance  performance  teared  up  heartwarming  priceless  Viral Video  Trending Video  

Other Articles