ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను ఇవాళ మరోమారు ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలని పేర్కోంది. ఈ నెల 20 వ తేదికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఐదు రోజుల క్రితం అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల తరపు వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. కాగా అర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వరాదని ఎన్సీబి అధికారులు తరపు వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
కార్డిల్యా క్రూజ్ కేసులోనూ ఆర్యన్ ఖాన్ కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు వున్నాయని ఎన్సీబి అధికారుల తరపు న్యాయవాది వాదనల నేపథ్యంలో ఈ కోణంలోనూ దర్యాప్తు జరగాల్సిన అవసరం వుందని న్యాయస్థానం పేర్కోంది. వాట్సాప్ చాట్ ఆదారంగా డ్రగ్స్ కేసులో కుట్ర కోణం ఉందని తమ 18 పేజీల ఆర్డర్ టు స్టేల్ లో ఎన్సీబి అధికారులు పేర్కోనడంపై ఆ దిశగా కూడా దర్యాప్తు జరగాలని పేర్కోన్న న్యాయస్థానం అర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా అర్యన్ ఖాన్ న్యాయవాదులు ఈ కేసులో అర్యన్ ఖాన్ కు ఎలాంటి సంబంధం లేదని, అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ ను ఎన్సీబి స్వాధీనం చేసుకోలేదని పేర్కోన్నారు.
ఇదిలావుండగా, వర్థమాన నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్ చేసినట్టు ఎన్సీబీ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో.. ఆ చాటింగ్ తాలూకు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజే ఆ నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి మెసేజ్ ల ద్వారా మాట్లాడినట్టు అధికారులు తేల్చారు. ఆ నటి త్వరలోనే బాలీవుడ్ సినిమాలో పరిచయం కానుందని సమాచారం. కొందరు డ్రగ్స్ సప్లయర్స్ తోనూ ఆర్యన్ ఖాన్ చాట్ చేసిన మెసేజ్ లనూ ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. వారితో ఆర్యన్ ఖాన్ తరచూ టచ్ లో ఉంటున్నాడని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more