Finance ministry tells govt departments to buy fresh Air tickets ఎంపీల ఉద్దర ఖాతాలకు టాటా చెప్పిన ఎయిరిండియా.!

Ai ai express say ta ta to credit sales finance ministry tells govt departments to buy fresh tickets

tata group, finance ministry, air india sale, air india, ai express, Parliament member, Central Government officials, Fresh tickets, Cash transactions, Air Travel, Reimbursement, Business news

With Air India and AI Express about to lose their PSU tag and return to founder Tata Group, the Centre has asked all ministries to clear dues to the airlines and make fresh purchases in cash only. “AI has stopped extending credit facility on account of purchase of air tickets,” an office memo issued by the finance ministry said.

ఎంపీలతో పాటు ప్రభుత్వ ఉద్దర ఖాతాలకు టాటా చెప్పిన ఎయిరిండియా.!

Posted: 10/30/2021 04:18 PM IST
Ai ai express say ta ta to credit sales finance ministry tells govt departments to buy fresh tickets

పార్లమెంటుకు చెందిన ఉభయ సభల సభ్యులు నిత్యం తమ నియోజకవర్గాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి విచ్చేసేందుకు గాను కొన్నేళ్లుగా తమ కోటాగా అందుకున్న విమాన ప్రయాణ టికెట్లకు ఇకపై చెక్ పడింది. గత కొన్నేళ్లుగా పార్లమెంటు సభ్యులు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను తమ అవసరాలకు వినియోగించుకున్నారు. అయితే ఇకపై అలా కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఎయిరిండియా సంస్థ ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైన వేళ ఈ మేరకు లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు కేంద్రం షాకిచ్చింది.

ఇకపై పార్లమెంటు సభ్యులు డబ్బులు పెట్టుకుని టికెట్లను కొనుగోలు చేయాలని ఆ తరువాత విమాన టికెట్లను రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేసుకోవాలంటూ రాజ్యసభ సచివాలయ బులిటెన్ స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడంతో పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా 34 టికెట్లు, వారి జీవిత భాగస్వాములకు మరో 8 టికెట్లు ఉచితంగా అందించేవారు. అయితే, ఇప్పుడు ఎయిర్ ఇండియా ‘టాటా’ల చేతికి వెళ్లిపోవడంతో ప్రైవేటీకరణ మొదలైంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. టికెట్ల కొనుగోలుకు పార్లమెంటు ఉభయ సభల సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ‘ఎక్స్‌చేంజ్ ఆర్డర్’ను చూపించి టికెట్లు కొని ఉంటే కనుక టీఏ క్లెయిమ్ చేసుకోవాలని సూచించింది. అయితే, బిల్లుల క్లియరెన్స్‌కు చాలా సమయం పడుతుంది కాబట్టి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఎంపీలకు ఇబ్బంది కలిగించే అంశమేనని చెబుతున్నారు. మరోపక్క, ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ నిధులను తాత్కాలికంగా స్తంభింపజేసిన కేంద్రం.. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు ఉన్న 10 సీట్ల కోటాతోపాటు కేంద్రమంత్రి మంజూరు చేసే అదనపు సీట్ల కోటాను కూడా రద్దు చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles