ఆరవై ఏళ్ల వయస్సున్న సాధారణ వ్యక్తిని కొరఢాతో కడుతుంటే.. చూసినవాళ్లు ఎవరైనా ఏం జరిగిందని అడగటం కామన్. ఇక ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాజకీయ నేతను ఎవరైనా కొరడాతో కొట్టగలరా.? అలా కొడుతుంటే చుట్టుపక్కన ఉన్నవాళ్లు కనీసం అక్షేపించరా..? అదీ కాలేదనుకుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ద్విత్రియ శ్రేణి నాయకులు, తృతీయశ్రేణి నాయకులు గమ్మనఉంటారా.? కానీ ఇక్కడ ఊరుకున్నారు. ఇది చాలదన్నట్లు తనను కొరడాతో ఎనమిది దెబ్బలు కొట్టిన వ్యక్తిని ముఖ్యమంత్రి కౌగలించుకుంటే. ఏంటో విచిత్రం. అంటానా.. లేక వివరాలు తెలుసుకుందాం అంటారా..
ఇక ఇప్పుడు నెట్టింట్లో ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్న వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. మీ గురించి మాకు తెలుసులేకానీ ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు.. అక్కడ నమ్మకాలు, ఆచారాలను పాటించడం భక్తులకు పరిపాటి. ఎంతటి రాజైనా దేవుడి అశీర్వచనాలు పోందాల్సిందేనని నమ్మిన చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా ఓ దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఆలయంలో వున్న ఓ అచారం మేరకు ఆయన కూడా దానిని ఫాలో అయ్యారు.. వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్‌లో ప్రతి ఏడాది గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తులు కొరడాతో కొట్టించికుంటారు.. గోవర్ధన్ పూజ తర్వాత కొరడా దెబ్బలు తింటే సమస్యలు అన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.. ఇక, దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవర్ధన్ పూజకు హాజరయ్యారు సీఎం భూపేశ్ బఘేల్.. ఈ సందర్భంగా బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తితో సీఎం భూపేశ్ బఘేల్‌ను కొరడాతో కొట్టించుకున్నారు.. ఇక, ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్పసంప్రదాయంగా తెలిపారు.. మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా భావి తరాలకు అందించడం మనంది బాధ్యత అన్నారు. అయితే, సీఎం కొరడాతో కొట్టించుకున్న వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
#WATCH | Chhattisgarh Chief Minister Bhupesh Baghel getting whipped as part of a ritual on the occasion of Govardhan Puja in Durg pic.twitter.com/38hMpYECmh
— ANI (@ANI) November 5, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more