Excise dept increases wine shops in Telangana మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్.. పెరిగిన దుకాణాల సంఖ్య

Excise department increases 404 wine shops in telangana

Wine Shops in Telangana, wine shop resevations, wine shop tenders, wine shops, Excise department, new wine shops, Telangana

Getting nod from the Government to increase the number of wine shops in the state, Excise Department increases 404 shops in the state to generate income from the shops.

మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్.. పెరిగిన దుకాణాల సంఖ్య

Posted: 11/08/2021 09:43 PM IST
Excise department increases 404 wine shops in telangana

రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో మద్యం దుకాణాల సంఖ్య 2,216 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్యను 2,620కి పెంచింది. డిసెంబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించింది. గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల కేటాయించినట్లు తెలిపిన ఎక్సైజ్ శాఖ ఓపెన్ కేటగిరీ కింద 1,864 లిక్కర్ దుకాణాలు మిగిలాయని వెల్లడించింది.

ఇక ఇవాళ్టి నుంచి ఈనెల 18వరకు దరఖాస్తులను స్వీకరించి ఈనెల 20న డ్రా ద్వారా షాపులను ఎక్సైజ్ శాఖ కేటాయించనుంది. గత రెండేళ్లల్లో మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేలా ఎక్సైజ్ శాఖ అధికారులతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమీక్షలో ఇటీవల చర్చించారు. అమ్మకాలు ఎక్కువ ఉన్నచోటే కొత్త దుకాణాలకు అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా కొత్తగా 404 మద్యం దుకాణాలను అదనంగా పెంచారు. దీంతో రాష్ట్రంలో ఇకపై 2620 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles