బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అనునిత్యం అండగా నిలిచిన వారని తమ జేబులోని వ్యక్తులుగా కొనియాడుతూ వివాదానికి తెరతీశారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం కావడంతో ఆయన వెనువెంటనే మెట్టుదిగివచ్చారు. అయితే తన వ్యాఖ్యలతో నోచ్చుకున్న కులాలకు క్షమాపణలు చెప్పకుండానే అపవాదు మొత్తానికి, ఎస్సీ, ఎస్టీల వెనుకబాటు తనానికి ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలకుల పాలనేకారణమని వివాదాన్ని పక్కదారి పట్టించారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఆయన నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే అంశాన్ని వివరిస్తూ.. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన తన చేతితో చోక్కా పైజేబును చూపుతూ.. బ్రాహ్మణులు, కింద జేబును చూపిస్తూ బనియాలు తమ జేబులోని వ్యక్తులని వ్యాఖ్యానించారు. ఈ సామాజిక వర్గాల నుంచి ఎక్కువమంది పార్టీ కార్యకర్తలుగా వుండడం వల్ల మీడియా కూడా బీజేపీని బ్రాహ్మణ, బనియాల పార్టీగా పిలుస్తుందని అన్నారు. అయితే, బీజేపీ అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతుందని స్పష్టం చేశారు.
మరోపక్క, బ్రాహ్మణులు తమ జేబులో ఉన్నారన్న మురళీధర్ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని అన్నారు. ఆ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, బ్రాహ్మణులు, బనియాలను కించపరిచారని అన్నారు. పార్టీ కోసం అహర్షిషలు కష్టడపడిన వర్గాలను ఇలా తూలనాడటం.. అవమానించడం బీజేపికి అలవాటేనని విమర్శించారు. కాగా కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మురళీధర్‌రావు తన వ్యాఖ్యలను ఆ పార్టీ వక్రీకరించిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ వెనుకబాటుకు గురికావడానికి వారి పాలనే కారణమని అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more