సిపిఐ జాతీయ నేత నారాయణ హీరోయిన్ కంగనా రనౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును అందుకున్న అమె ఆ సందర్భంగా దేశ స్వాతంత్ర్యంపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. భారత మాత బానిస శృంఖాళాలను తెంచిన స్వాతంత్ర్యాన్ని అమె చులకన చేసి మాట్లాడటం అమె అవగాహనా రాహిత్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. కంగన ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అని.. పద్మశ్రీ అవార్డు ఆమెకు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని వ్యంగంగా చెప్పుకొచ్చాడు.
దేశస్వాతంత్రం గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఆమెకు లేదని.. మోడీ ప్రధానమంత్రి అయిన తరువాతే దేశానికి స్వాతంత్రం వచ్చిందనే వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు. దేశ స్వాతంత్ర్యంపై అమె చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుని వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేకపోతే తీవ్రమైన పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపి ఎంపీ వరుణ్ గాంధీ కూడా తనదైన శైలిలో స్పందించారు.
కంగనా రనౌత్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా? లేక దేశద్రోహంగా భావించాలా? అని ప్రశ్నించారు. అమె చేసిన ఈ వ్యాఖ్యలపై యావత్ దేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అవగాహనా రాహిత్యంతో కొందరు చేసే వ్యాఖ్యలతో దేశానికి అపఖ్యాతిని ఆపాదించేలా వున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగింది. దేశ స్వాతంత్ర్యాన్ని అవమానించిన ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ డిమాండ్ చేశారు. అమాయక రైతులు, మోడీ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వారిపై కాకుండా ఇలాంటి వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అమాయక రైతులపై, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై, గ్యాస్, డీజిల్ పెట్రోల్ ధరల పెంపును అక్షేపించిన వారిపై, కుంభకోణాలపై మాట్లాడిన వారిపై, నోట్ల రద్దుతో ఏం సాధించారని ప్రశ్నించిన వారిపై బీజేపి పాలకులు దేశద్రోహం కింద కేసులు పెడుతూ.. దేశ స్వాత్రంత్యాన్నే అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ లాంటి వ్యక్తులకు పద్మశ్రీ బిరుదులతో సత్కారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more