దేశవ్యాప్తంగా ఎన్నో ఘటను జరుగుతున్నా.. ఇప్పటికీ క్షుద్రగాళ్లను నమ్ముతూ.. తమ పురాతన ఇళ్లలో దాగి వున్న నిధిని వెలికితీసే చర్యలకు పాల్పడుతున్నారు అమాయక ప్రజలు. క్షుద్రగాళ్లను నమ్మి మధ్యప్రదేశ్ లో ఒక భార్యభర్తలు వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సెక్స్ వర్కర్లను హత్య చేసిన ఘటనను మార్చిపోకముందే.. అలాంటి మరో ఘటన కర్నాటకలోని రామనగర ప్రాంతంలో బయటపడింది. ఇంట్లో దాగి వున్న నిధిని బయటకు తీస్తానని చెప్పి ఓ రైతు కుటుంబాన్ని నమ్మించిన ఓ క్షుద్రగాడు.. తన ఎదుట ఒక మహిళను నగ్నంగా కూర్చోబెట్టాలని షరతు విధించాడు. స్థానికుల పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పూజారితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని రామనగర ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు.. తమకు తెలిసిన వాళ్ల వివాహానికి తమిళనాడుకు వెళ్లాడు. ఆ సమయంలో తమిళనాడుకు చెందిన షాహికుమార్ అనే పూజారితో ఆయనకు స్సులో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంగా తాను తన పూర్వికులకు చెందిన 75 ఏళ్ల నాటి భవనంలోనూ ఇప్పటికీ ఉంటున్నామని శ్రీనివాస్ షాహీకుమార్ తో చెప్పాడు. దీంతో ఆప్పటి భవంతులలో పెద్దలు నిధిని దాచి పెట్టేవారని.. చెప్పాడు షాహీకుమార్. అలా నిధి వుందో లేదో తాను చూస్తే కానీ చెప్పలేనని అన్నాడు. దీంతో రైతు శ్రీనివాస్.. షాహీకుమార్ ను ఓ పర్యాయం తన ఇంటికి రమ్మిన ఆహ్వానించాడు.
దీంతో శ్రీనివాస్ ఉండే రామనగర ప్రాంతానికి వచ్చిన షాహికుమార్ అతనికి చెందిన భవంతిని పరిశీలించాడు. ఈ భవంతిలో ఒక పురాతనమైన నిధి దాచిపెట్టారు. అది చాచి పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా దానిని మీరు బయటకు తీయలేదు. దానిని వెంటనే బయటకు తీయాలి. లేని పక్షంలో మీ కుటుంబానికి కష్టాలు తప్పవు’ అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న సదరు శ్రీనివాస్ ఆ నిధి బయటకు ఎలా తీయాలని షాహీకుమార్ ను అడిగాడు. అందుకతను తాను ఉన్నానని, తానే అంతా చేసుకుంటానని శ్రీనివాస్ తో నమ్మబలికాడు. ఇదంతా 2019లో జరిగింది.
వెంటనే బయటకు తీయాలని చెప్పిన నిధిని రెండేళ్లు కావస్తున్నా.. ఇంకా బయటకు తీసేందుకు షాహీకుమార్ రాకపోవడంతో.. అతడికి ఫోన్ చేసి అడిగాడు శ్రీనివాస్. అప్పటికే నిధిని బయటకు తీసేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో పాటు షాహీకుమార్ ను నమ్మిన శ్రీనివాస్.. అతనికి రూ. 20 వేలను కూడా అడ్వాన్సుగా అందజేశాడు. కాగా అప్పటి నుంచి కరోనా సాకు చూపించి.. వాయిదా వేస్తూ వచ్చిన షాహికుమార్.. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీనివాస్ ఇంటికెళ్లిన షాహీకుమార్ ఆ నిధి బయటకు రావాలంటే ఒక స్త్రీ నగ్నంగా తన ముందు కూర్చొని పూజలో పాల్గొనాలని, ఆమె ఇంటి యజమాని కుటుంబ సభ్యురాలైతే ఇంకా మంచిదని చెప్పాడు.
ఈ అంశంపై సుదీర్ఘంగా అలోచించిన శ్రీనివాస్.. రెండు మూడు రోజుల తర్జనభర్జన పడిన తరువాత.. అతని భార్యను పంపడానికి నిరాకరించాడు. అయితే స్తానికంగా కూలీ పని చేసుకునే మహిళకు విషయాన్ని చెప్పాడు. అందుకు అమె అంగీకరిస్తూ అమెకు రూ.5 వేలు ఇస్తానన్నాడు. దీనికి అమె అంగీకరించింది. షాహీకుమార్ కు మహిళ కూడా సిద్దంగా వుందని పూజను ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు వస్తోందని చెప్పాడు. ఇక షాహీకుమార్ శ్రీనివాస్ ఇంట్లోని ఓ గదిని ఎంచుకుని పూజకు సంసిధ్దుడయ్యాడు. కూలీ చేసుకునే మహిళ కూడా వచ్చి పూజా సమయంలో శరీరంపై నూలుపోగు లేకుండా కూర్చుంది.
అయితే శ్రీనివాస్ ఇంట్లో ఎదో జరుగుతుందని అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వచ్చి చూసేసరికి షాహీకుమార్ పూజ చేస్తూ వున్నాడు. అతని అసిస్టెంటుతో పాటు ముగ్గరు మేస్త్రీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పూజ జరిగే ప్రాంతానికి ఆ మహిళ నాలుగేళ్ల కూతుర్ని కూడా తీసుకురాగా, చిన్నారిని బలి ఇవ్వడానికే తెచ్చారనే వాదనలు వినిపించినా పోలీసులు వాటిని తోసిపుచ్చారు. అయితే మహిళా కూలిని పూజలో నగ్నంగా కూర్చునేందుకు ఒప్పించిన రైతు శ్రీనివాస్ పై మాత్రం పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more