తన కస్టమర్లకు భారతీ ఎయిర్ టెల్ సంస్థ పెద్ద షాకే ఇచ్చింది. టారిఫ్ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. ప్రీ-పెయిడ్ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతీ ప్యాక్ మీద పది రూపాయల మినిమమ్ పెంపును ప్రకటించింది. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్ సోమవారం ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్ టారిఫ్ ప్రస్తుతం 79రూ. ఉండగా, అది రూ.99 కానుంది. దీంతో పాటు అన్ని ప్లాన్లపై ఈ పెంపు వర్తించనుందని ప్రకటించింది.
ఇక డాటా టాప్ అప్స్ లో 48 రూ. అన్ లిమిటెడ్ 3జీబీ డాటా ప్యాక్ ను 58రూ. లకు పెంచేసింది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఈ ధరలు టెలికామ్ సబ్ స్క్రయిబర్స్ కు వర్తింప జేయనున్నాయి. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) కింద 200 నుంచి 300 రూ. అవుతోందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. టారిఫ్ పెంపు మౌలిక సదుపాయాలలో "గణనీయమైన పెట్టుబడులకు" దారి తీస్తుందని, భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుందని సోమవారం ఓ ప్రకటన ఎయిర్‌లెట్ పేర్కొంది.
ఇదిలా ఉంటే టెలికామ్ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే టారిఫ్‌లను పెంచకతప్పదని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఆగస్టులోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక తాజా టారిఫ్ పెంపుదల నేపథ్యంలో #Airtel మీద సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా సెటైర్లు పేలుతున్నాయి. కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుని అధునాతన సాంకేతికతను అందిస్తామని చె్పడం విడ్డూరంగా వుందని.. జనం సోమ్ములో అందుబాటులోకి తీసుకువచ్చే అదునాతన సాంకేతికతను కూడా డబ్బులకే విక్రయిస్తారు కానీ.. ఉచితంగా ఇవ్వరు. ఇది ఎయిర్ టెల్ గొప్ప వ్యాపారకోణమంటై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more