Viral video: Man's jugaad to make own seat on train అవసరం అన్ని ఇన్నోవేటివ్ అలోచనలకు అమ్మ.!

Viral video man makes his own jugaad train seat leaves passengers dumbstruck

Ghazab Ka Jugad, Ghazab Ka Jugad Lagaya, passenger makes own jugad, passenger creates own berth, Google Trends, Google Trends Today, Jugad Ka Video, Trending Video, video viral, Viral Video Today, Jugad viral video, Trending jugad video

A hilarious video is going viral on social media where an Indian man was seen making a ‘jugaad’ seat on a train. The video was shared on Instagram a few days ago by a meme page called ‘memes.bks’ with the following caption, “U can’t match with Indian mind”. Since then, the video has gone viral with more than 72,000 views and over 6,670 likes.

ITEMVIDEOS: అవసరం అన్ని ఇన్నోవేటివ్ అలోచనలకు అమ్మ.. అంటే ఇదేనేమో.!

Posted: 11/23/2021 06:21 PM IST
Viral video man makes his own jugaad train seat leaves passengers dumbstruck

అవసరం అన్ని ఇన్నోవేటివ్ అలోచనలకు అమ్మ అని ఊరికే పెద్దలు అనలేదు. దీనిని తేలిగ్గా తీసిపారేయలేం కూడా. ఇదే అవసరం ఉంది కాబట్టే ప్రపంచలో ఇప్పటికే ఇంకా అనేక ఇన్నోవేటివ్ అలోచనలతో ఉత్సత్తులు తయారవుతున్నాయి. నీకు అవసరం వుందంటే.. సూర్యరశ్మిని కూడా విద్యుత్ గా మార్చి వాడుకునే దిశగా నిన్ను నిలిపింది. అయితే కొందరి అలోచనలు మరీ అంత పెద్దగా వుండవు.. కానీ ఆ పూటకు అవసరాన్ని తీర్చేలా ఉంటాయి. అందుకోసమే వారు తమ బుద్దికి పనిపెడతారు. ఆ బుద్ది శరవేగంగా అలోచనలు చేసి సృజనాత్మకంగా సలహాలను ఇస్తోంది. అదే విషయాన్ని ఇక్కడ ఈ బర్త్ కన్ఫామ్ కాని ప్రయాణికుడు కూడా చేతల్లో చూపించాడు.  

అత‌డు చేసిందేం లేదు. కాస్త త‌న మెద‌డుకు ప‌దును పెట్టాడు. రాత్రంతా హాయిగా ట్రెయిన్‌లో నిద్ర‌పోయాడు. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఏం చేశాడంటారా? ట్రెయిన్‌లో సీటు దొర‌క‌లేదు. ఏం చేస్తాడు. కింద ప‌డుకుందామంటే.. అటూ ఇటూ వెళ్లే వాళ్ల‌తో గొడ‌వ‌. అందుకే.. బుర్రకు ప‌నిచెప్పాడు. దీంతో ఒక మంచి ఐడియా త‌ట్టింది. దీంతో వెంట‌నే త‌న బ్యాగులో నుంచి ఓదుప్ప‌టి తీసి.. ట్రెయిన్ మీద ల‌గేజ్ పెట్టుకునే స్టాండ్‌కు.. ఇవ‌త‌లి వైపు సీటు పైన ఉండే స్టాండ్‌కు దుప్ప‌టిని క‌ట్టేశాడు.

ఆ త‌ర్వాత చిన్న‌పిల్లాడిలా అందులో దూరిపోయి హాయిగా నిద్ర‌పోయాడు. ఆ వ్య‌క్తి చేసిన ఆ ప‌ని చూసి ట్రెయిన్‌లోని ప్ర‌యాణికులంతా నోరెళ్ల‌బెట్టారు. సీటు లేకున్నా.. భ‌లే ప్లాన్ వేసి ఎంత హాయిగా నిద్ర‌పోయాడు అంటూ అంద‌రూ అత‌డి ఐడియాను మెచ్చుకున్నారు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు అయితే మ‌నోడి ఐడియాను చూసి తెగ పొడుగుతున్నారు. ట్రెయిన్‌లో జూగాడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి సీటుకు టికెట్ తీసుకోవాల్సిన ప‌ని కూడా లేదు అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు చేశారు.

 
 
 
View this post on Instagram

A post shared by MEMES.BKS (@memes.bks)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghazab Ka Jugad  own jugad  train jugaad  train passenger  trending  Viral video  

Other Articles