కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఈడీ (ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) డైరెక్టర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి ఐదేళ్ల కాలానికి పొడగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల పాటు పొడగిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. పిటిషన్ విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని పిటిషనర్ ఆరోపించారు. సభలో మెజారిటీ లేకుండా ఆర్డినెన్స్ జారీ చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. కాగా, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని విపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆర్డినెన్స్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా పిటిషన్ దాఖలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more