వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆందోళనల్లో మరణించిన రైతులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారా లేదా..? అని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తూ మరణించిన రైతులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి రికార్డులు లేవని, కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు దేశరాజధాని ఢిల్లీ శివారల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాగా ఏడాది సమయం కావస్తున్న తరుణంలో కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు వీరి నిరసనలకు తలొగ్గి సాగుచట్టాలను ఉపసహరించుకుంది. అయితే.. గత ఏడాది కాలంగా చలికి వణుకుతూ.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. కరోనా లాంటి కనిపించని శత్రువు పంజా విసురుతున్నా వెన్నుచూపకుండా అక్కడే తిష్టవేసి నిరసనలు తెలిపారు. అయితే ఈ క్రమంలో కొందరు అందోళన చెంది బలవన్మరణాలకు పాల్పడితే.. నిరసనల్లో భాగంగా కొందరు అనారోగ్యం బారిన పడి మరణించారు.
మొత్తంగా గత ఏడాది కాలం నుంచి మొత్తంగా 750 మంది రైతులు నిరసనదీక్ష స్థలితో పాటు ఆయా రాష్ట్రాల్లోనూ నిరసనలు చేపట్టి మరణించారు. మరికోందరు మాత్రం అందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా ఉద్యమించగా, వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో కొందరు తమ కార్లతో కూడా తోక్కించేశారు. ఇలా కూడా ఎనమిది మంది రైతులు మరణించారు. అయితే సాగుచట్టాలను వెనక్కి తీసుకన్న ప్రభుత్వం.. ఏడాది కాలంగా నిరసనలు చేపట్టి మరణించిన రైతులకు పరిహారం అందిస్తారా.? అని ప్రశ్నించాగా, వారి మరణాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని.. అందుచేత పరిహారం చెల్లించలేమని పార్లమెంటులో కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రికార్డులు లేనందున ప్రతిపక్షాలు ఇకపై ఆ ప్రస్తావన తేవొద్దని మంత్రి కోరారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనపై కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రకటనను తప్పుపట్టారు. రైతుల మరణాలకు సంబంధించి రికార్డులు లేవని చెప్పడం వారికి తీవ్ర అవమానమన్నారు. కేంద్రం అలాంటి ప్రకటన ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆందోళనల్లో చనిపోయిన 700 మంది రైతుల డేటానే సేకరించలేకపోతే.. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన లక్షల మంది డేటాను కరెక్టుగా సేకరించిందని ఎలా నమ్మగలమని ఖర్గే అనుమానం వ్యక్తం చేశారు. గడిచిన రెండేండ్లలో కరోనా కారణంగా 50 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతే.. ప్రభుత్వం మాత్రం కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే మరణించినట్లు చెబుతున్నదని ఆయన విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more