సింహం సింహమే. అడవిలో మృగరాజైనా.. అడవికి రారాజైనా అది సింహం మాత్రమే. అయితే అడవిలో తమకు ఆకలి వేసినప్పుడు ఈ క్రూర మృగాలు అవలంభించే విధానాలు మనుషలు విస్తుపోయేలా చేస్తుంటాయి. ఆ మధ్యకాలంలో ఒ చిరుత లేడిని వేటాడానికి వచ్చిన సందర్భంలో పోలంలో గడ్డిని మేస్తున్న జింకకు ఏ మాత్రం అనుమానం రాకుండా నక్కుతూ వచ్చి.. ఓ చెట్టును ఆసరా చేసుకుని దాక్కుని.. అక్కడ తన కాళ్లను విధుల్చుకుని జింకపై పంజా విసిరిన వీడియో మనం చూశాం. అయితే ఈ వీడియోలోని మృగరాజుకు కూడా ఆకలేసిందో.. లేక సరదాగా ఆటాడుకుందో కానీ ఓ జీపులో వచ్చిన పర్యాటకులకు మాత్రం వెన్నులో చలిపుట్టేలా చేసింది. అదెలా అంటారా..
తాజాగా అది టూరిస్టులు ఉన్న ఓ సఫారీ జీపుపై అటాక్ చేయబోయిన ఓ సింహం ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు. సౌతాఫ్రికాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టూరిస్టులతో ఉన్న సఫారీ జీపు వెళ్తుండగా.. సింహం చూసింది. అయితే.. అప్పటికే ఆ జీపు ఇసుకలో చిక్కుకుపోగా.. టూర్ గైడ్.. ఒక తాడు వేసి దాన్ని రోడ్డు మీదికి లాగేందుకు ప్రయత్నాలు చేశాడు. ఇంతలో సింహం వచ్చింది. దీంతో అందరూ వాహనం ఎక్కారు. ఆ సింహం.. సఫారీ జీపుపై అటాక్ చేయబోయి.. అక్కడ కనిపించిన తాడును పట్టుకొని లాగింది.
ఇంతలోనే వాహనం స్టార్ట్ అయి ముందుకు కదలడంతో ఆ తాడుతో పాటు సింహం కూడా కొద్ది దూరం ముందుకు వెళ్లింది. అయినా కూడా ఆ సింహం ఆ తాడును వదల్లేదు. టగ్ ఆఫ్ వార్ ఆడింది సఫారీతో. ఈ ఘటనను సఫారీలో ఉన్న టూరిస్టులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. క్యాట్ విల్ బి క్యాట్ అంటూ కామెంట్లు చేసి వీడియోను వైరల్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more