కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ డెల్టా వేరియంట్ కన్నా ఆరు రెట్టు వేగంగా వ్యాప్తిచెందుతుందని.. ఈ క్రమంలో అది ఎటునుంచైనా.. ఎప్పుడైనా రావచ్చునని తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని అన్నారు. బౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడంతో పాటు ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా కరోనా వాక్సీన్ రెండు డోసులు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు వాక్సీన్ తీసుకోని వారితో పాటు రెండో డోసు తీసుకోని వారు కూడా వెంటనే వ్యాక్సీన్ తీసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణలో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యిందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలిలో ఒమిక్రాన్ బయటపడిందన్న వార్తల నేపథ్యంలో కొన్ని గంటల వ్యవధిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన విమనంలో యూనైటెడ్ కింగ్ డమ్ నుంచి 35 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు వచ్చిందని.. అమెకు విమానాశ్రయంలోనే పరీక్షలు చేయగా అమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని, అయితే అమె నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని ఆయన తెలిపారు.
నివేదికలు వచ్చిన తరువాత అది ఏంటన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. సదరు మహిళ రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా ఆయన తెలిపారు. బాధితురాలిలో ఎలాంటి లక్షణాలు లేవని, అమె అరోగ్యంగ కూడా నిలకడగానే వుందని శ్రీనివాసరావు తెలిపారు. కాగా, తెలంగాణలోకి మొత్తంగా 239 మంది యూకే, సింగపూర్ల నుంచి వచ్చారని, వారిందరినీ క్వారంటైన్ కు తరలించి.. వారి అరోగ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. కాగా ఇప్పటివరకు 325 మందిలో ఒకరు మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలారని అన్నారు. ఇక రాష్ట్రంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా తిరేగే వారిపై జరిమానా విధిస్తామని చెప్పారు. మాస్క్ ధరించని పక్షంలో రూ.1000 జరిమానా విధించే ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బయటకు వచ్చే ప్రతీ ఒక్కరు తమ కోవిడ్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా పట్టుకెళ్లాలని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more