సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’లో రీ-ఇన్ ఫెక్షన్ ప్రభావం కూడా మూడు రెట్లు అధికంగా వుందని, ఇది డెల్టా వేరియంట్ కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇప్పటికే అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కోత్త వేరియంట్ ను తొలిసారిగా గుర్తించిన దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సెన్ డాక్టర్ ఏంజెలిక్ కొయెట్జీ ఒమిక్రాన్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇది డెల్టా, బీటా వేరియట్లకు చాలా భిన్నంగా వుందని అన్నారు. ఒమిక్రాన్ వైరస్ సోకినవారికి బీటా, డెల్టా వేరియంట్ తరహాలో రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు కనిపించదని తెలిపారు.
అంతేకాదు ముక్కు మూసుకుపోవడం, తీవ్రమైన జర్వం.. నాడీ రేటు పడిపోవడం.. శరీరంలో ఆక్సిజన్ శాతం మందగించడం లాంటి లక్షణాలు కూడా కనిపించవని అమె తెలిపారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలుంటాయన్నారు. కేవలం ఒక్కరోజు శరీరిక అలసట ఉందన్న అమె.. గొంతులో దురద ఉంటుందని తెలిపారు. డెల్టా వేరియంట్ తో పోల్చితే ఒమిక్రాన్ లో తీవ్రమైన లక్షణాలు లేవని అన్నారు. ఆసుపత్రిలో చేరే ముప్పు చాలా తక్కువేనని, ఇంట్లోనే నయం చేసుకోవచ్చన్నారు. కాగా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకూ ఇది సోకినా.. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లతో పోలిస్తే రక్షణ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. టీకాలు వేయించుకోకుంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు.
కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పై కొవాగ్జిన్ టీకా ప్రభావంతంగా ఉంటుందని ఐపీఎంఆర్ నిపుణులు పేర్కొన్నారు. కొవాగ్జిన్ టీకా ఒమిక్రాన్ వేరియంట్ పై మిగతా వ్యాక్సిన్ల కంటే మరింత ప్రభావంతంగా ఉంటుందన్నారు. ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ సాంకేతికతపై వ్యాక్సిన్ తయారైందని, ఇది కొత్త వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా ఉంటుందన్నారు. టీకా ఇంతకు ముందు వచ్చిన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సైతం సమర్థవంతంగా పని చేసినట్లు గుర్తు చేశారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారంతా జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా ప్రభావాన్ని తెలుసుకునేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more