Will Discuss How Agitation Moves Forward: Rakesh Tikait డిమాండ్ల పరిష్కారం కానిపక్షంలో దీక్షలు విరమించం: టికాయత్

Need state wise compensation for farmers who died in protests rakesh tikait

5-member committee, Rakesh Tikait, Samyukt Kisan Morcha, MSP, kin of farmers, farmers protest, farm laws, compensation for deaths of farmers, Bharatiya Kisan Union, arm Laws Repeal Bill

Bharatiya Kisan Union (BKU) leader Rakesh Tikait has called for state-wise compensation and employment for the kin of farmers who lost their lives while agitating against the farm laws. "Our demand for minimum support price (MSP) is from the Government of India. The talks have just started, we will see how it goes.

డిమాండ్ల పరిష్కారం కానిపక్షంలో దీక్షలు విరమించం: టికాయత్

Posted: 12/04/2021 06:40 PM IST
Need state wise compensation for farmers who died in protests rakesh tikait

కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం సంయక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఐదు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. రైతుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడే అధీకృత సంస్థ ఇదేనని చెప్పారు. ఈ కమిటీలో బల్బీర్ సింగ్ రాజేవాల్, శివ కుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ చారుణి, యుధ్వీర్ సింగ్, అశోక్ ధావలే సభ్యులుగా ఉంటారని అన్నారు. ఎస్‌కేఎం తదుపరి సమావేశం ఈ నెల 7న జరుగుతుందని వెల్లడించారు. కాగా, గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలతోపాటు రాష్ట్రపతి కూడా ఇటీవల ఆమోదం తెలిపారు. దీంతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) శనివారం కీలక సమావేశం నిర్వహించింది. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడంతోపాటు రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోని పక్షంలో తమ ఇళ్లకు తిరిగి వెళ్లకూడదని రైతు సంఘాల నాయకులు నిర్ణయించినట్లు రైతు నాయకుడు దర్శన్ పాల్ సింగ్ తెలిపారు. రైతులపై ఉన్న అన్ని కేసులను బేషరుతుగా వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళనను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపామన్నారు. తాము ఉత్పత్తి చేసిన పంటలకు ఎంఎస్పీ ధరలపై కూడా చట్టాలని తీసుకువచ్చే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించాలని అన్నారు. ఈ డిమాండ్లకు కేంద్రం సానుకూలగా స్పందించిన పక్షంలోనే నిరసన దీక్షలను విరమిస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles