ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు విస్తరించడం.. ఇక తొలిసారిగా వెలుగుచూసిన సౌతాఫ్రికాలో కాకవికళం చేసేలా 25 శాతానికి పాజిటివిటీ రేటు పెరగడం ప్రపంచదేశాలను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు శాతంగా వున్న పాజిటివిటీ రేటు ఏకంగా 25శాతానికి పెరగడంతో ప్రపంచదేశాలు హడలెత్తిపోతున్నాయి. అక్కడ రోజువారి కేసులు ఏకంగా పదివేలకు పైగానే నమోదువుతున్నాయి. దక్షిణాఫ్రికాలో అటు సాధారణ కరోనా సహా ఇటు ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో నాలుగోదశ భీభత్సం కోనసాగుతోంది. దీంతో ఆ దేశం ప్రధానంగా వాక్సీనేషన్ పై దృష్టి సారించింది.
ఇదిలాఉండగా భారతదేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అదనపు డోసును వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ అత్యధికంగా చిన్నారులపై ప్రభావాన్ని చూపుతుందని పర్యవేక్షించిన ఐఎంఏ .. మన దేశంలోని చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం అధికంగా పడకుండా 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కోరింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోని కీలక రాష్ట్రాల్లో నమోదయ్యాయని.. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుందని చెప్పింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని తెలిపింది. దేశంలో ఇప్పటికే 1.26 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను వేశారని... మొత్తం దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వ్యాక్సిన్ వల్ల కరోనా ఇన్ఫెక్షన్ ను నిలువరించవచ్చనే విషయం ఇప్పటికే రుజువయిందని చెప్పింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మనం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ఒమిక్రాన్ ప్రభావాన్ని కూడా ఎదుర్కోవచ్చని తెలిపింది.
ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేయించుకోవాలని కోరుతున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని వారిపై ఫోకస్ పెట్టాలని, వారు టీకా వేయించుకునేలా చూడాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వానికి తెలిపింది. దేశంలో ఒమిక్రాన్ మహమ్మారిని ధీటుగా అడ్డుకుని నియంత్రించే చర్యల్లో భాగంగా ముందువరుసలో నిలిచే ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి మూడో డోసు వ్యాక్సిన్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని మెడికల్ అసోసియేషన్ చెప్పింది. వీరితో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, రిస్క్ అధికంగా వున్నవారికి కూడా అదనపు డోస్ ఇవ్వాలని తెలిపింది.
డెల్టా వేరియంట్ తరహాలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండదని... కానీ, డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ 5 నుంచి 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ట్రావెల్ బ్యాన్ విధించాలని తాము సూచించడం లేదని తెలిపింది. అయితే అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోవద్దని, పెద్ద సంఖ్యలో గుమికూడటం చేయవద్దని చెప్పింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లో కోవిడ్ ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించాలని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more